Begin typing your search above and press return to search.

RRR ప్ర‌మోష‌న్స్.. ఆ హీరోయిన్‌ క‌నిపించ‌దే

By:  Tupaki Desk   |   13 Dec 2021 5:30 PM GMT
RRR ప్ర‌మోష‌న్స్.. ఆ హీరోయిన్‌ క‌నిపించ‌దే
X
రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ వ‌చ్చే నెల సంక్రాంతికి వ‌ర‌ల్డ్ వైడ్ గా సంద‌డి చేయ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ప‌రంగా స్పీడు పెంచేశారు. అయితే ఈ ప్ర‌చార పర్వంలో ఓ హీరోయిన్ మిస్స‌వుతోంది. ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా.

సిల్వ‌ర్ స్క్రీన్ పై త‌న‌దైన హాట్ లుక్స్ తో ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసిన శ్రియ ఇటీవ‌ల కొంత విరామం తీసుకుని ఓ పాపకు జన్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. తెలుగులో టాప్ హీరోలంద‌రితో క‌ల‌సి న‌టించిన శ్రియ క్రేజీ స్టార్‌ల చిత్రాల్లోనూ న‌టించిన మెరిసింది. అయితే గ‌త కొంత కాలంగా ఆమెకు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప్రాధాన్య‌త వున్న పాత్ర‌లు మాత్ర‌మే వ‌స్తున్నాయి.

శ్రియ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ ఆర్ ఆర్‌` లో అజ‌య్ ద‌వ‌గ‌న్ కి జోడీగా న‌టించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్ లోనూ క‌నిపించి ఆక‌ట్టుకున్న శ్రియ ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ విష‌యంలో అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజ‌మౌళి ఈ చిత్ర ప్ర‌చారం కోసం కేవ‌లం ప్ర‌ధాన హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, కీల‌క పాత్ర‌ధారి అజ‌య్ దేవ‌గ‌న్‌, హీరోయిన్ అలియా భ‌ట్ ల‌ని మాత్ర‌మే వాడుకుంటున్నాడ‌ని, త‌న‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం లేద‌ని శ్రియ వాపోతోంద‌ట‌.

ఇదిలా వుంటే `గ‌మ‌నం`లో కీల‌క పాత్ర పోషించిన శ్రియ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రాక‌పోయినా సినిమాని నిల‌బెట్ట‌డం కోసం శ్రియ ప‌లు టీవీ ఛాన‌ల్ ల‌కి వెళ్లి ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటోంది. ఒక వేళ రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌చారం కోసం పిలిస్తే ఖ‌చ్చితంగా వెళ‌తాన‌ని శ్రియ చెబుతోంద‌ట‌. అయితే సినిమాలో శ్రియ లీడింగ్ లేడీ కాక‌పోవ‌డంతో ప్ర‌చారం కోసం ఆమెపై మేక‌ర్స్ ఇంట్రెస్ట్ చూపించ‌డం లేద‌ని చెబుతున్నారు.