Begin typing your search above and press return to search.

వాళ్ల వలనే న కెరీర్ బావుంది

By:  Tupaki Desk   |   29 Jan 2018 4:30 PM GMT
వాళ్ల వలనే న కెరీర్ బావుంది
X
అందానికి వయసుతో సంబంధం లేదని ఉదాహరణకు శ్రియని చూపించవచ్చు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన ఈ బ్యూటీ వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. తన వయసుతో సంబంధం లేకుండా కొంత మంది కుర్ర హీరోలతో కూడా నటించింది. ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా కూడా శ్రియ ఇంకా వెండితెర లోకంలో తన ఇమేజ్ ని ఒక లెవెల్ లో సెట్ చేసుకుంటు వెళుతోంది. అంతే కాకుండా గ్లామర్ ని కూడా బాగానే మెయింటేన్ చేస్తోంది.

ఇక 2018లో మొదట శ్రియ గాయత్రి సినిమా ద్వారా రాబోతోంది. ఫిబ్రవరి 9న ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా అమ్మడు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను తెలిపింది. శ్రియ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర అమాయకంగా ఉంటుంది. పల్లెటూరిలో సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయిలా కనిపిస్తా. దర్శకుడు మదన్ నా పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు. అతను కథ చెప్పినప్పుడే చాలా కనెక్ట్ అయ్యాను. మదన్ డైరెక్షన్ చాలా కూల్ గా ఉంటుంది. సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. అలాగే పాత్రలను చూపించిన విధానం అందరికి నచ్చుతుంది.

నిజంగా ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా షూటింగ్ చేస్తున్నన్నీ రోజులు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక పాటలో వచ్చే కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. ఇన్నేళ్లలో నా కెరీర్ బావుండడానికి కారణం దర్శకులు - రచయితలు మంచి కథలను రాస్తుండడం వల్లే. అలాగే నేను సినిమాలను ఎంచుకునే విధానం కూడా నాకు ప్లస్ పాయింట్ అని శ్రియ వివరిస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వీరభోగ వసంతరాయలు అనే సినిమాతో పాటు తమిళంలో కార్తీక్ నరేన్ తో ‘నరగసూరన్’ చేస్తున్నానని చెప్పింది.