Begin typing your search above and press return to search.
స్టార్ హీరోల గురించి శ్రియా చెప్పిన ముచ్చట్లు...!
By: Tupaki Desk | 8 Jun 2020 2:30 AMసౌత్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్ధాలుగా హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రియా శరణ్. 2001లో 'నా ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీయా కింగ్ నాగార్జునతో నటించిన 'సంతోషం' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు శ్రీయాకి. కొన్నేళ్ల పాటు తన వాలుచూపుతో యువ హృదయాలు కొల్లగొట్టింది శ్రియా శరన్. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున - చిరంజీవి - బాలయ్య - వెంకటేష్ - మోహన్ బాబు సరసన నటించింది. మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - రవితేజ - ప్రభాస్ - ఎన్టీఆర్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోలతో కూడా నటించిన శ్రీయా.. శర్వానంద్ అల్లరి నరేష్ - తరుణ్ లాంటి హీరోల సరసన కూడా మెరిసింది. తెలుగు - తమిళ - కన్నడ - హిందీ - మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన శ్రీయ ఇప్పటికీ నటిస్తూనే ఉంది. 2018లో ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీయ ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉండిపోయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డైలీ తన అప్ డేట్స్ పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.
ఈ సందర్భంగా తాను నటించిన కొంతమంది హీరోల గురించి అడుగగా వారి గురించి చెప్పుకుంటూ వచ్చింది శ్రీయ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కళ్లు బాగుంటాయని.. అలా చూస్తూ ఉండిపోవచ్చని చెప్పుకొచ్చింది. ప్రభాస్ - శ్రియా కలిసి 'ఛత్రపతి'లో నటించారు. అంతేకాకుండా 'మున్నా' సినిమాలో ఒక సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళంలో తనకు ఫేవరేట్ హీరో అని.. ఆయన ఒక పవర్ హౌజ్ అని చెప్పింది. రజినీతో కలిసి 'శివాజీ' సినిమాలో నటించేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది. ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు చూస్తే చాలా సైలెంట్ గా కనిపించేవాడని.. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు.. ప్రస్తుతం అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పింది శ్రీయ. వీరిద్దరూ 'నా అల్లుడు' సినిమాలో కలిసి నటించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ అతను చాలా మంచి యాక్టర్ అని.. పవన్ బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. తమిళ్ హీరో ధనుష్ అద్భుతమైన టాలెంటెడ్ యాక్టర్ అని.. ఆయనతో నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. ధనుష్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని.. తనకు కొడుకు పుట్టినప్పుడు నేను తండ్రి అయ్యానని సంతోషంగా అందరికీ చెప్పాడని వెల్లడించింది.
ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న యువ హీరోయిన్స్ కి ఇచ్చే టిప్స్ ఏమీ లేవని.. మీ బెస్ట్ ఇవ్వండి.. బాగా కష్టపడండి.. వర్క్ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి.. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగిపోవాలని సూచనలు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కరోనా వచ్చి చాలా విషయాలను నేర్పిందని.. దీని వలన జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని.. లాక్ డౌన్ స్టోరీస్ ఇన్స్పైర్ చేశాయని చెప్పుకొచ్చింది. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ మొత్తం 5 సినిమాలకు కమిట్ అయినట్లు వెల్లడించింది. తెలుగులో రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో పాటు మొదటిసారి సృజన అనే లేడీ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు చెప్పింది. అంతేకాకుండా రెండు తమిళ సినిమాలు.. 'తడ్కా' అనే హిందీ సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది శ్రియా శరణ్. మొత్తం మీద ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్స్ ఒకటీ రెండు సినిమాలకు పరిమితమవుతుంటే వచ్చి 20 ఏళ్ళవుతున్నా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ యంగ్ స్టర్స్ కి కూడా కాంపిటేషన్ గా మారుతోంది శ్రియా.