Begin typing your search above and press return to search.
కమర్షియల్ ట్వీట్ కి శ్రియ కలరింగ్
By: Tupaki Desk | 24 Jan 2018 4:32 AM GMTకొత్త ఏడాది వస్తోందనగానే.. చాలా మంది అనేక కొత్త నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అలా చేయాలి.. ఇవి మానేయాలి.. ఈ మాటకు కట్టుబడి ఉండాలి.. అలవాట్లు మార్చుకోవాలి.. అబ్బో ఈ తరహా న్యూ ఇయర్ రిజొల్యూషన్స్ కు అసలు కొదువే ఉండదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలపై ఆలోచనలు చాలానే చేస్తారు కానీ.. వీటిని ఆచరణలో పెట్టడం దగ్గరే అసలు సమస్య అంతా మొదలైపోతుంది.
న్యూ ఇయర్ రిజొల్యూషన్స్ లో భాగంగా ఒన్ మినిట్ ఓథ్ తీసుకుందట శ్రియ. అంటే రోజుకో నిమిషం పాటు కచ్చితంగా యోగా చేస్తానని.. దీన్నో అలవాటుగా మార్చుకుంటానని ఒట్టు పెట్టేసుకుందట ఈ టాలీవుడ్ బ్యూటీ. మరి దీన్ని నిలబెట్టుకుందా అనే డౌట్ రావచ్చుకదా.. ఆ సంగతే చెబుతూ.. ఈ వన్ మినిట్ ఓథ్ ను కంటిన్యూ చేస్తున్నానంటూ.. తను యోగా చేస్తున్న ఓ చిన్నపాటి వీడియోను కూడా పోస్ట్ చేసింది శ్రియ. కేవలం నిమిషం పాటు మాత్రమే సమయం పట్టే ఈ దినచర్యను చేయాల్సిందిగా.. అనిరుధ్ రవి చందర్ ను.. ఆర్తి శరణ్ ను కూడా కోరింది.
అయితే.. ఈ ట్వీట్ లో అసలు సిసలు ట్విస్ట్ ఏంటంటే ఓ కంపెనీ తయారు చేసిన ఓట్స్.. ఈమె కొత్త సంవత్సరం నిర్ణయాన్ని కొనసాగించడంలో సహాయపడ్డాయని చెప్పింది శ్రియా శరణ్. అంటే ఈ ట్వీట్ పెట్టడంలో అసలు ఉద్దేశ్యం.. ఆ కంపెనీకి ప్రచారం చేసిపెట్టడం అన్నమాట. కమర్షియల్ ట్వీట్ కి శ్రియ భలే కలరింగ్ ఇచ్చింది కదూ.