Begin typing your search above and press return to search.

ఫ్రెష్ లుక్స్ కోసం ఏం చేస్తోందబ్బా?

By:  Tupaki Desk   |   6 Jun 2016 11:30 AM GMT
ఫ్రెష్ లుక్స్ కోసం ఏం చేస్తోందబ్బా?
X
అమ్మాయిలు టీనేజ్ లో అందంగా ఉంటారు.. థర్టీ బిలో ఉన్నపుడే ఆకర్షణీయంగా ఉంటారు.. థర్టీ ప్లస్ అయితే ఇక అందం తరిగిపోయినట్లే. ఇదీ కామన్ గా ఒపీనియన్. ఇదుగో.. ఇక్కడ కనిపిస్తున్న సుందరాంగి శ్రియ ఫోటోలు చూశాక.. ఇలా అన్నవాడు కనిపిస్తే కాల్చేయాలని అనిపించడం ఖాయం. ఇప్పుడు ఈ అమ్మడికి అక్షరాలా 33 ఏళ్ల వయసు నిండిపోయింది. థర్టీ ప్లస్ లో తన కూడా అందాలతో ముద్ద మందారంలా మత్తెక్కిస్తోంది.

ఎల్ అఫీసియల్ మేగజైన్ జూన్ ఎడిషన్ లో శ్రియా శరణ్ చేసిన అందాల విందు.. ఆమె ఫ్యాన్స్ కు కొత్త ఊపు తీసుకొచ్చేసింది. మొన్నా మధ్య మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ తీస్తే.. అందులో శ్రియ పేరు సెకండ్ లో ఉండడం జనాలకు గుర్తుండే ఉంటుంది. ఇంతగా ఈ భామకు క్రేజ్ ఉండడానికి.. అమ్మడి అందం, ఆకర్షణ మాత్రమే కాదు.. ఏజ్ పెరిగినా.. కొంచెం కూడా దాన్ని పైకి కనబడనివ్వకుండా ఈమెగారి మెయింటెనెన్స్ అసలు రీజన్.

ఏజ్ ఎంత అన్నది కాదు పాయింట్.. ఏ రేంజ్ లో చూసేవాళ్లను కట్టిపడేయగలమనే విషయంలో.. బహుశా శ్రియ మాస్టర్స్ ఏమన్నా చేసుంటుంది. 16 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్న ఓ అమ్మడు.. ఇప్పటికీ ఇంత ఫ్రెష్ గా కనిపించడం అంటే.. అది శ్రియకు మాత్రమే సాధ్యమైన విషయం. ఎనీ డౌట్స్?