Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్ తో డేటింగ్ చేయట్లేదు -శ్రీయ

By:  Tupaki Desk   |   19 Oct 2016 4:09 AM GMT
ఆ క్రికెటర్ తో డేటింగ్ చేయట్లేదు -శ్రీయ
X
15 ఏళ్లుగా టాలీవుడ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న శ్రియా శరణ్.. ఇంకా ప్రతిష్టాత్మకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకుంటోంది. గ్లామర్ నుంచి హిస్టారికల్ వరకు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల ఒయ్యారమైన బాడీ.. శ్రియ ఆస్తి. బేసిక్ గా డ్యాన్సర్ కావడంతో.. అరంగేట్రం నాటి మెరుపులు ఇంకా శరీరంలో కాపాడుకుంటూ వస్తున్న ఈ భామపై.. రీసెంట్ గా రూమర్లు వచ్చాయి.

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవోతో శ్రియ లవ్వులో పడిపోయిందన్నది ఆరోపణ. అతడితో డేటింగులు గట్రా చేసేస్తోందంటూ.. ముంబై సబర్బన్ లో బ్రేవో-శ్రియలు డిన్నర్ కి వెళుతున్న ఫోటోలను సాక్ష్యంగా కూడా చూపించేశారు. దీంతో సీనియర్ బ్యూటీ లవ్ ఎఫైర్ నడిపించేస్తోందనే వార్తలొచ్చాయి. కానీ వీటన్నిటికీ చెక్ చెప్పేసింది 34 సంవత్సరాల అందగత్తె. బ్రేవోతో తాను డేటింగ్ చేయడం లేదని.. ముంబైలో కలిసినపుడు కేజువల్ డిన్నర్ చేశామంతే అంటూ తేల్చేసింది శ్రియ.

బ్రేవోనే కాదు.. తన లైఫ్ లో ఎవరూ లేరని.. తాను ఇంకా సింగిల్ అంటూ శ్రియ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేయడంతో.. పుకార్లు పుట్టించిన వాళ్ల నోళ్లకు తాళాలు పడ్డాయి. ప్రస్తుతం బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో హీరోయిన్ మెప్పించేందుకు శ్రియా శరణ్ తన ప్రతిభ అనుభవాలు మొత్తాన్నీ రంగరించేస్తోందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/