Begin typing your search above and press return to search.

శ్రియ దొంగ చాటుగా తిరుమల దర్శణం..!!

By:  Tupaki Desk   |   31 Aug 2018 12:57 PM IST
శ్రియ దొంగ చాటుగా తిరుమల దర్శణం..!!
X
సెలబ్రెటీలు తిరుమలకు వెళ్లడం చాలా కామన్‌గానే చూస్తూ ఉంటాం. సినీ తారలు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంకు వెళ్లినప్పుడు కాస్త హడావుడి కనిపిస్తూ ఉంటుంది. మీడియా వారు వారితో మాట్లాడేందుకు, వారిని కవర్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కొందరు పర్వాలేదు అన్నట్లుగా ఉంటారు, మరి కొందరు మాత్రం ఇబ్బందిగా ఫీల్‌ అవుతారు. అయితే శ్రియ మాత్రం తాజాగా తిరుమల దర్శనం పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో తన ఫేస్‌ను పూర్తిగా కనిపించకుండా మూసేసుకోవడం చర్చనీయాంశం అవుతుంది.

శ్రియ తన ఫేస్‌ను కనిపించకుండా, మీడియా వారికి చిక్కకుండా వెళ్లి పోవడంకు కారణం ఉంది. శ్రియ 2008వ సంవత్సరంలో తిరుమల వచ్చిన సమయంలో చేదు అనుభవంను ఎదుర్కుంది. అప్పుడు తిరుమల వెంకటేశుని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియా వారితో మాట్లాడుతుండగా, వెనుక నుండి ఒక వ్యక్తి శ్రియ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో అతడి చెంప పగులకొట్టింది. అప్పట్లో పెద్ద సంచలనం అయిన సంఘటన మళ్లీ పునరావృతం అవ్వకూడదనే ఉద్దేశ్యంతో శ్రియ ఇలా రహస్యంగా వచ్చి వెళ్లినట్లుగా అక్కడ మీడియా మిత్రులు అనుకుంటున్నారు.

గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవంను ఆమె ఇంకా దృష్టిలో పెట్టుకుంది కనుకే మొహం కనిపించకుండా జాగ్రత్త పడటం జరిగింది. శ్రియ మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రెటీలు కూడా తిరుమలలో ఇబ్బంది పడ్డ సంఘటనలు జరిగాయి. భక్తులు మరియు ఫొటోగ్రాఫర్‌ లు సెలబ్రెటీలు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున తోసుకుంటారు. దాంతో ఎక్కువ శాతం సెలబ్రెటీలు తిరుమలకు రహస్యంగా వచ్చి వెళ్తుంటారని స్థానికులు చెబుతూ ఉంటారు.