Begin typing your search above and press return to search.

బాల్కనీలోనే కాపురం పెట్టిన శ్రియ!

By:  Tupaki Desk   |   10 May 2020 7:15 AM GMT
బాల్కనీలోనే కాపురం పెట్టిన శ్రియ!
X
ఎవరో జైలు జీవితం అలవాటు ఉన్నవారికి తప్ప సాధారణ వ్యక్తులకు.. ఇతర సెలబ్రిటీలకు ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండడం అనేది కష్టమైన.. మహా క్లిష్టమైన.. అతి సంక్లిష్టమైన విషయమే. అందుకే కొంచెం గ్యాప్ ఇస్తే చాలు జనాలు బండ్లు తీసుకుని తుర్రున రోడ్లమీదకు దూసుకుపోతూ ట్రాఫిక్కు జాములు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ లాక్ డౌన్ ను.. సెల్ఫ్ ఐసోలేషన్ రూల్స్ ను చాలా స్ట్రిక్టుగా ఫాలో అవుతున్నారు. ఆలా ఘట్టిగా రూల్స్ ఫాలో అయ్యేవారిలో శ్రియ కూడా ఉంది.

శ్రియ తన భర్త ఆండ్రీ కొస్చీవ్ తో కలిసి ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న దేశాలలో ఒకటైన స్పెయిన్ లో ఉంది. అక్కడ ఇంట్లోనే ఉంటే మరీ బోర్ కుడుతుందని బాల్కనీలో సెటిల్ అయిపోయింది. వరసగా వీడియోలు పెడుతూ.. తన బాల్కనీ సామ్రాజ్యంలో ఐసోలేషన్ జీవితాన్ని అద్భుతంగా గడుపుతోంది. తాజాగా ఈ భామ మరో బాల్కనీ వీడియోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో శ్రియ.. ఆండ్రీ ఇద్దరూ బాల్కనీలో కూర్చుని. పానీ పూరి పాని పూరి పానీ పూరి పానీ పూరి అంటూ స్పెయిన్ దేశంలో ఇండియన్ పానీ పూరిని తింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజులు ఆగితే మిర్చి బజ్జి మిర్చి బజ్జి అంటారేమో.

కొంతమంది హీరోయిన్లకు ఫోటోలు తీసుకునేందుకు లోకేషన్లు దొరక్కపోవడంతో తమ సోషల్ మీడియా ఖాతాలలో కొత్త ఫోటోలు.. వీడియోలు పోస్ట్ చేయడం మానుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి కాలం నాటి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శ్రియ అలా కాదు.. భర్త ఆండ్రీ తో కలిసి బాల్కనీలో కాపురం పెట్టేసింది. ఎవరేమనుకుంటే నాకేంటి.. ఉండేది ఒకే లొకేషన్.. అన్నీ వీడియోలు ఇదే లొకేషన్లో తీస్తా.. అంటున్నట్టుంది వ్యవహారం. ఎవరైనా ఏం చెయ్యగలరు.. ఆమె ధైర్యానికి ఒక లైక్ కొట్టడం.. మహా అయితే షేర్ చెయ్యడం తప్ప!