Begin typing your search above and press return to search.
50 లక్షలకు ఒప్పుకున్న పెళ్లైన హీరోయిన్
By: Tupaki Desk | 14 July 2018 6:32 AM GMT వయసు పెరిగినా వన్నె తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది హీరోయిన్ శ్రియా.. ఎప్పుడో 15 ఏళ్ల కింద ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ లాంగ్ రన్ లో ఎంతో మంది అగ్రహీరోలతో నటించింది. రీసెంట్ గా బాలయ్య - నాగార్జునలతో కూడా కలిసి నటించి మెప్పించింది. కాలం గడిచేకొద్ది హీరోయిన్లకు డిమాండ్ తగ్గిపోతుండగా.. శ్రియాకు మాత్రం రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది.
శ్రియా ఇటీవలే పెళ్లి చేసుకుంది. రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెబుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏదీ లేదని తేల్చిచెప్పింది. కొద్దిరోజుల్లోనే షూటింగ్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే పెళ్లి అయ్యాక ఈ హీరోయిన్ కు క్రేజ్ తగ్గాలి కానీ భారీగా పెరిగింది. తాజాగా శ్రియాను ఓ లేడి ఓరియెంటెడ్ కథ వెతుక్కుంటూ వచ్చింది. సినిమాటోగ్రాఫర్ సుజన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రియాది చాలా డిఫెరెంట్ రోల్ అట. డీ గ్లామరస్ గా చేయాలని దర్శకురాలు కోరడంతో అలాంటివి చేసేందుకు ఏకంగా రూ. 50లక్షలు డిమాండ్ చేసిందట.. అరకోటి అడిగినా.. ఆ పాత్ర కోసం నిర్మాతలు ఒప్పుకొని ఆమెకు ఓకే చెప్పారట.. ఇలా పెళ్లి అయిపోయినా కూడా శ్రియాకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ రావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.