Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్ ను శ్రీయ డేటింగ్ చేస్తోందా?

By:  Tupaki Desk   |   13 Oct 2016 6:02 AM GMT
ఆ క్రికెటర్ ను శ్రీయ డేటింగ్ చేస్తోందా?
X
అది ముంబయ్ లోని ఒక పోష్ రెస్టారెంట్. అయితే ఆ రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుండి చాలామంది సెలబ్రిటీలు బయటకు వెళిపోతుంటారు. అందుకే అటువైపు కొందరు కెమెరామ్యాన్లు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటారు. ఒకవేళ వారికెవరైనా సెలబ్రిటీలు కనిపిస్తే టకీమని క్లిక్కులు కురిపిస్తారు. ఇదే విధంగా చాలామంది హీరోయిన్లను తమ ఫేవరేట్ పీపుల్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు కెమెరాల్లో బంధించేసిన వీరు.. ఇప్పుడు సెక్సీ లేడీ శ్రీయ సరన్ ను కూడా బంధించేశారు.

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలసి శ్రీయ ఆ రెస్టారెంట్ లో లంచ్ డేట్ కు వెళ్లిందట. ఇద్దరూ కలసి బయటకు వస్తున్పప్పుడు చకచకా ఫోటోలు తీసేశారు. అయితే కెమెరావారిని చూసి ముఖం దాచుకోకుండా కేవలం ఆ క్రికెటర్ చేతిని మాత్రం వదిలేసి హ్యాపీగా రోడ్డు దాటుకుంటూ ఫోజులు ఇచ్చేసింది అమ్మడు. రెండు రోజుల్లో అమెరికా వెళ్లి అక్కడ ఒక చారిటీ ఈవెంట్లో డ్యాన్స్ చేయనున్న శ్రీయ.. ఊరెళ్ళేముందు ఇలా స్పెషల్ లంచ్ కు వచ్చిందంటే.. ఖచ్చితంగా వీరి మధ్యన మ్యాటర్ పరిగెత్తెస్తోంది అంటున్నారు రూమర్ రాయుళ్ళు.

ఏదేమైనా కూడా.. ఇప్పటివరకు శ్రీయతో లింకప్ చేయబడిన వారి సంఖ్య డజనుకు చేరింది. ప్రతీసారి శ్రీయ వారిని డేట్ చేస్తోందంటూ న్యూసులు రావడం.. వారి ఫోటోలు దొరకడం.. చివరకు ఆమె స్వయంగా 'నేను సింగిల్' అంటూ చెప్పడం జరిగిపోతోంది. కాదంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/