Begin typing your search above and press return to search.

వీడియో: క్రేజీ బికినీ..స్టన్నింగ్ డ్యాన్స్

By:  Tupaki Desk   |   6 Jun 2019 2:05 PM GMT
వీడియో: క్రేజీ బికినీ..స్టన్నింగ్ డ్యాన్స్
X
సీనియర్ హీరోయిన్ శ్రియ జోరు మామూలుగా లేదు. వెకేషన్ అంటే అందరూ ఏ వారం రోజులో పది రోజులో వెళ్తారు కానీ శ్రియ మాత్రం గత నెల రోజులకు పైగా అన్నీ దేశాలు తిరుగుతూ తన భర్తతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. మొదట్లో బ్రిటన్ లో హంగామా చేసింది. ఆ తర్వాత మెక్సికో కి మకాం మార్చింది. అంతటితో ఆగలేదు. కొలంబియాకు పయనం అయింది. అక్కడ హంగామా చేస్తోంది. ఆమధ్య ఒకసారి తన భర్త ఆండ్రీ కొస్ఛీవ్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ఇంకా శ్రియ-ఆండ్రీ ల సమ్మర్ వెకేషన్ దిగ్విజయంగా కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే ఒక వారం క్రితం శ్రియ తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బికినీ ధరించి.. పైనేమో ఒక చున్ని లాంటిది వేసుకొని మెక్సికోలోని ఒక చీకటి గుహలో శ్రియ డ్యాన్స్ చేసింది. ఆ గుహలో సూర్య కిరణాలు శ్రియపై మాత్రమే ఫోకస్ లైట్స్ లాగా పడుతూ ఉండడంతో ఆ డ్యాన్స్ మరింత స్పెషల్ గా మారింది. శ్రియ ట్రెయిన్డ్ కథక్ డ్యాన్సర్ అనే సంగతి తెలుసు కదా. దీంతో ఆ స్టెప్పులలో ఒక గ్రేస్ ఉంటుంది. పైగా హాట్ డ్రెస్ కావడంతో నెటిజనులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.

ఈ వీడియో తీసింది శ్రియ భర్తగారు ఆండ్రీ కొస్చీవ్ కావడం గమనించాల్సిన అంశం. శ్రియా అల్లరికి తగ్గ చిలిపి భర్తే దొరికాడు. ఈ వీడియోకు భారీగానే కామెంట్లు వచ్చాయి.. "ఫన్నీ గర్ల్ ఎట్ హార్ట్".. "ఏషాలు మామూలుగా లేవు".. "క్రేజీ బికినీ..స్టన్నింగ్ డ్యాన్స్" అంటూ కామెంట్లు పెట్టారు. శ్రియా హంగామా చూసి ఈ టూర్లతోనే తన జీవితం అంతా గడిపేస్తుందని మీరు పుసుక్కని అనుకుంటారేమో. కాదు బాబోయ్ కాదు. శ్రియ ప్రస్తుతం హిందీలో 'తడ్కా' లో నటిస్తోంది.. తమిళంలో 'నరగాసురన్'.. 'సండకారి' సినిమాలలో నటిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి