Begin typing your search above and press return to search.
హృదయం బద్దలైనా సరే.. షూటింగ్ కు వచ్చిందట
By: Tupaki Desk | 8 Dec 2021 12:30 PM GMTహీరోయిన్ ఆయుష్షు ఎంతన్న ప్రశ్నకు రోటీన్ గా వచ్చే సమాధానాన్ని మార్చేశారు కొందరు కథానాయకులు. అందులో ఒకరు శ్రియ. వయసు మీద పడుతున్నా.. నాయికగా నటిస్తూ.. తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతున్న ఆమె.. ఇటీవల తల్లి కావటం తెలిసిందే. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో చోటు చేసుకునే మార్పులకు భిన్నంగా ఉన్నారు శ్రియ. తాజాగా ఆమె నటించిన గమనం విడుదలకు దగ్గరైంది. ఇలాంటి వేళ.. ఈ సినిమాలో నటించిన శ్రియ ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.
అందరూ అనుకుంటున్నట్లుగా ఇది హీరోయిన్ ఓరియంట్ మూవీ కాదని స్పష్టం చేసిన ఆమె.. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ఫ్రెండ్ చనిపోయారని.. ఆ వేళలో హృదయం బద్దలైనా సరే.. షూటింగ్ కు మాత్రం వచ్చినట్లుగా చెప్పారు. మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ గురించి ఈ మూవీ చెబుతుందన్న ఆమె.. ఎవరికి వారు ఈ సినిమాలో కనిపిస్తారన్నారు.
తానున్న విషాదకర మూడ్ నుంచి బయటకు వచ్చేందుకు ఈ మూవీ కథ తనకు ప్రేరణగా నిలిచిందన్నారు. ఈ సినిమాలో మూడు కథలు ఒకేసారి సాగుతుంటాయని.. ప్రతి కథా ఎంతో స్ఫూర్తిని ఇస్తుందన్నారు. సినిమాల పట్ల ఇటీవల తన అభిప్రాయం మారిందని.. ఇకపై ఎంపిక చేసుకునే కథలన్నీ తన కుటుంబ సభ్యుల్ని గర్వపడేలా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
నటనకు పెద్ద పీట వేయాలని తాను నిర్ణయించుకున్నానని.. ఈ సందర్భంలో వచ్చిన అవకాశమే గమనమని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు మాదిరి చివరి క్షణం వరకూ తాను నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సో.. శ్రియ సినీ ప్రేక్షకుల్ని ఎప్పటికి వదిలి పెట్టే ఛాన్సే లేదన్న విషయాన్ని తాజా ప్రకటనతో స్పష్టం చేసినట్లే.