Begin typing your search above and press return to search.

ఎత్తి మరీ చూపిస్తోందా? చూస్తోందా?

By:  Tupaki Desk   |   18 Dec 2015 3:30 PM GMT
ఎత్తి మరీ చూపిస్తోందా? చూస్తోందా?
X
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ఎవరు.. ఈ ప్రశ్నకు మళ్లీ ఎదురు ప్రశ్నలు చాలానే ఉంటాయి. ఏజ్ ప్రకారమా,.. క్రేజ్ ప్రకారమా - స్టేజ్ ప్రకారమా.. ఇవన్నీ కాదు కానీ.. ఎక్స్ పీరియన్స్ ప్రకారం అయితే.. శ్రియనే సీనియర్ హీరోయిన్ అని చెప్పాలి. 2001 నుంచి ఈ భామ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. అంటే ఇప్పటికి 15 ఏళ్లుగా తన కెరీర్ ని కంటిన్యూ చేస్తోదన్న మాట.

ఇంత ఎక్కువ నటనా అనుభవం ఉన్నా.. ఈమె ఏజ్ పట్టుమని 32 ఏళ్లే. అయితే.. 15 ఏళ్ల క్రితం ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే కనిపిస్తుండడం.. శ్రియా శరణ్ స్పెషాలిటీ. ఇందుకోసం ఆమె పడే కష్టం చాలానే ఉంది. రోజు సుదీర్ఘంగా వర్కవుట్ చేస్తూనే ఉంటుంది. తన ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉంటుంది. బాడీ విషయంలో శ్రియ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. యాక్టింగ్ తో పాటు.. అమ్మడికి డ్యాన్సింగ్ లోనూ మంచి అనుభవం ఉండడంతో.. ఇలా శరీరాకృతి కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తను వర్కవుట్స్ చేసిన తర్వాత.. తన బాడీని తనే చూసుకుంటూ.. ఓ ఫోటో క్లిక్ చేసుకుంది. ఇలా తన టీషర్ట్ ఎత్తి చూసుకుంటున్న శ్రియ చిత్రాన్ని మరొకరు తీశారు. ఈ ఫోటోను తనే నెట్ లో పోస్ట్ చేసింది ఈ భామ.

ఎంతగా తన నడుం ఒంపులను చూసుకోవడానికి అయితే మాత్రం.. ఇంతలా ఎత్తి మరీ చూసుకోవాలా అనుకుంటున్నారు చూసినవాళ్లు. అయితే.. తను ఎంతగా బాడీ మెయింటెయిన్ చేస్తుందో చూపించడానికే ఇదంతా అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయినా ఇంత ఫిట్నెస్ కాపాడుకోగలదు కాబట్టే.. ఇప్పటికీ హీరోయిన్ ఛాన్సులు వస్తున్నాయి శ్రియకి.