Begin typing your search above and press return to search.
#పూజా డే.. మ్యూజిక్ స్కూల్ ని లాంచ్ చేసిన శ్రీయ
By: Tupaki Desk | 16 Oct 2021 1:55 PM GMTముంబైలో సెటిలయ్యాక శ్రియా శరణ్ ద్విభాషా చిత్రం `మ్యూజిక్ స్కూల్` లో నటిస్తున్నానని ప్రకటించారు. పాపారావు బియ్యాల ఈ చిత్రానికి దర్శకుడు. యామిని ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయనే 12 పాటలు రాయడమేగాక స్వరపరచనున్నారు. పిల్లలపై నేటి విద్యావ్యవస్థ ఒత్తిడి నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ కలిగించే చిత్రమిదని కథనాలొచ్చాయి. వైద్యులు లేదా ఇంజనీర్లు కావాలని మాత్రమే లక్ష్యంగా నిర్ధేశిస్తున్న పేరెంట్ కి చెంపపెట్టుగా ఉండే కథనంతో తెరకెక్కనుంది. కళ లేదా క్రీడ కోసం సమయం కేటాయించకుండా పిల్లలపై ఒత్తిడిని పెంచుతున్నారని వారిలో సృజనాత్మకతను నాశనం చేస్తున్నారని ఇందులో సందేశం ఇవ్వనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ప్రణాళికలో వేగం పుంజుకుంది. శ్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో అందమైన ఫోటోలను పంచుకుంది. “ఈ అద్భుతమైన చీర .. దసరాను అందంగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. పాపారావు సర్ దర్శకత్వంలో ఈ సినిమాను దసరా కానుకగా ప్రారంభిస్తున్నాం. ముర్రే కొరియోగ్రఫీ తో.. లెజెండరీ ఇళయరాజా సర్ సంగీతం అదనపు బలం. ప్రతిభావంతులైన శర్మంజోషి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను`` అని శ్రీయ వెల్లడించారు.
పూజా కార్యక్రమాల్లో శ్రీయ ఎర్రని భారీ ఎంబ్రాయిడరీ చీరలో అందంగా కనిపించింది. దసరా రోజు ముహూర్తం అనంతరం పూజా చిత్రాలను ఆమె పంచుకున్నారు. ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ `ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్`లోని మూడు పాటలను కూడా రీమిక్స్ చేయనున్నారని సమాచారం.
సంగీతం నేపథ్యంలో ఈ హాస్య ప్రధాన చిత్రాన్ని హైదరాబాద్ -గోవాలో చిత్రీకరిస్తారు. పాపారావు బియ్యాల రచన - దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్- బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. గాయకుడు షాన్ కూడా ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తారు. సినిమాటోగ్రాఫర్ కిరణ్ దేవోహన్స్ (జోధా అక్బర్) ఈ సినిమాకి పని చేయనున్నారు. యామిని ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.