Begin typing your search above and press return to search.
థర్టీ ఇయర్స్ హాటీ.. టెన్షనేం లేదంటోంది
By: Tupaki Desk | 17 Feb 2016 7:30 AM GMTహీరోయిన్లకు 30 ఏళ్లు వచ్చాయంటే ఇక వాళ్ల పనైపోయినట్లే అంటారంతా. ఐతే బాలీవుడ్లో కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు 30 ప్లస్ లోనూ బాగానే హవా సాగిస్తున్నాడు. ఇక సౌత్ లో నయనతార, త్రిష లాంటి వాళ్లు లేటు వయసులో ఘాటుగా చెలరేగిపోతున్నారు. ఇప్పుడీ జాబితాలోకి శ్రుతి హాసన్ కూడా వచ్చేసింది. ఆమెకు 30 ఏళ్లు వచ్చేశాయంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే శ్రుతి ఇండస్ట్రీలోకి నిన్నో మొన్నే వచ్చినట్లే ఉంది. 25వ ఏట హీరోయిన్ గా అరంగేట్రం చేయడం వల్ల ఆమెకు 30 ఏళ్ల వయసొచ్చేసిందంటే నమ్మశక్యం కాలేదు. పాతికేళ్ల అమ్మాయిల నవనవలాడిపోతుండటం వల్ల కూడా ఈ విషయాన్ని నమ్మడం కొంచెం కష్టమే.
30 ప్లస్ లోకి వచ్చేశారు కదా మరి టెన్షనేం లేదా అని శ్రుతిని అడిగితే.. ‘‘ఈ వయసు రాగానే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో, లేదంటే అక్క పాత్రలో చేస్తానని అనుకుంటున్నారా ఏంటి? నా దృష్టిలో ఇది పెద్ద విషయమేం కాదు. ఐతే 30 ఏళ్లు పూర్తి చేసుకున్నామంటే మన జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తున్నట్లే. ఈ దశ పట్ల చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా ఉన్నాను. నేను కమల్ హాసన్ కూతుర్ని కాబట్టి నాకు 30 ఏళ్లు వచ్చేశాయని అందరికీ తెలిసిపోతుంది. ఐతే ఇప్పుడే నా వయసు గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి. పాతికేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న చాలామందిని మనం చూస్తున్నాం. వాళ్లు ఇలాంటి ప్రశ్నలతో ఎలా మేనేజ్ చేశారో ఏంటో. నాకైతే వయసు గురించి ఎలాంటి టెన్షన్ లేదు’’ అని చెప్పింది శ్రుతి. 30 ఏళ్లు పూర్తయ్యాయి కదా.. ఇప్పుడైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా అని అడిగితే.. ‘‘నేను పెళ్లి చేసుకుంటానా లేదా అనే విషయంలో జనాలకు ఇంత ఆసక్తి ఎందుకో నాకర్థం కాదు. ఐతే నేనెప్పటికీ పెళ్లి చేసుకోను అని మాత్రం అనను’’ అని శ్రుతి సమాధానం దాటవేసింది.