Begin typing your search above and press return to search.

శృతి కోసమే జనాల సెర్చింగ్‌

By:  Tupaki Desk   |   27 Jan 2016 7:30 AM GMT
శృతి కోసమే జనాల సెర్చింగ్‌
X
రీసెంట్ గా జరిగిన ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది ఆకట్టుకుంది. కాజల్ ఈరేంజ్ లో క్లీవేజ్ చేయం ఇదే మొదటిసారి కావడంతో.. ఆన్ లైన్ అంతా కాజల్ కోసం వెతుకులాడింది. ఇప్పుడు హైద్రాబాద్ లో ఐఫా ఈవెంట్ జరిగింది. ఈసారి నెటిజన్లు తమ అటెన్షన్ మొత్తాన్ని శృతి హాసన్ పై పెట్టారు.

డార్క్ మెరూన్ కలర్ గౌన్ లో మెరిసిపోయింది శృతిహాసన్. దాదాపు టాప్ లెస్ అనిపించేంతటి క్లీవేజ్ తో అదరగొట్టేసింది. తన అందాలను ఈ రేంజ్ లో గతంలో కూడా ప్రదర్శించిన రికార్డ్ ఈమెకు ఉన్నా.. ఎప్పటికప్పుడు కొత్తగా చూపించడంలో శృతి బాగా ఆరితేరిపోయింది. అసలు ఐఫా అవార్డుల్లో చాలామంది భామలు క్లీవేజ్ షో చేశారు. రెజీనా - రకుల్ - రాశి ఖన్నా లాంటి కుర్ర భామలు కూడా కిక్ ఎక్కించారు. ఎంతమంది ఎంతగా ఎగ్జిబిషన్ పెట్టినా.. ఎక్కువ ఓట్లు శృతిహాసన్ కే పడుతున్నాయి. ప్రదర్శించడమే కాదు, వాటిని ప్రొజెక్ట్ చేయడంలో కూడా శృతికి ఉన్న తెలివితేటలే దీనికి కారణం. ఐఫా ఫంక్షన్ లో మాత్రం శృతి హాసనే మోస్ట్ సెర్చింగ్ గ్లామరస్ డాల్.

అక్కడేమో కాజల్, ఇక్కడేమో శృతి.. మొత్తానికి సౌత్ సుందరాంగులు ఫంక్షన్లలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయిపోతుండడం విశేషం. అలాగే గూగుల్‌ - యాహూ - బింగ్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్స్‌ లో కూడా వీరు టాప్‌ సెర్చ్‌ ఎలిమెంట్స్‌ గా తయారవ్వడం మరో విశేషం. కాని గ్లామరసానికి ఇంత క్రేజా అంటూ మనం ముక్కున వేలేసుకోవాల్సిందే.