Begin typing your search above and press return to search.
నేనో రౌడీని, అందుకే రౌడీల్నే ఇష్టపడతా
By: Tupaki Desk | 27 Aug 2015 2:05 PM GMTశ్రుతిహాసన్ నటించిన శ్రీమంతుడు రికార్డులు తిరగరాసింది. ఇక ఇప్పట్లో తెలుగు తెరపై కనిపించేదే లేదు. 2016 వరకూ శ్రుతిహాసన్ నటించిన తెలుగు సినిమా చూడలేం. ఈ అమ్మడు హిందీ, తమిళ్ లో అంత బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో నానా పటేకర్, అనీల్ కపూర్, జాన్ అబ్రహాంలతో కలిసి 'వెల్ కమ్ బ్యాక్ సీక్వెల్'లో నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి రానుంది. ఈ సందర్భంగా శ్రుతి ముచ్చటిస్తూ.. చాలా ఆసక్తికర సంగతులే చెప్పింది.
=నేను వెల్ కమ్ బ్యాక్ సీక్వెల్ లో నటిస్తున్నా .. అనగానే అంతా ఆశ్చర్యంగా చూశారు. నాకు మాత్రం చాలా ఎగ్జయిటింగ్ అనిపించింది. వెంటనే ఒప్పేసుకున్నా. వెల్ కమ్ బ్యాక్ లో నానా, జాన్ వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది.
=జాన్ అబ్రహాం రగ్డ్ గా కనిపిస్తాడు.. నిజమే .. అతడిలోనీ రౌడీ లుక్ నాకు ఇష్టం. నిజ జీవితంలో మరీ రాముడు మంచి బాలుడు తరహా నచ్చరు. కాస్త రఫ్ గా, రౌడీలా కనిపిస్తేనే ఇష్టం. ఎందుకంటే నేనో రౌడీని కదా! రౌడీల్లోనూ బోలెడంత ఫన్ ఉంటుంది. అది నాకు నచ్చుతుంది.
=గబ్బర్ ఈజ్ బ్యాక్ లో చేసిన క్యారెక్టర్ కి ఈ పాత్రకి సంబంధం లేదు. ఇదో ఫ్యామిలీ డ్రామా. ఈ తరహాలో ఏ క్యారెక్టర్ ని బాలీవుడ్ లో చెయ్యలేదింతవరకూ. అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా.
=మా ఇంట్లో ఎప్పుడూ హ్యూమర్ ఉంటుంది. కానీ నాన్నగారి నుంచి కామిక్ టైమింగ్ నేర్చుకోలేకపోయాను. నా కామెడీ టైమింగ్ భయానకం.
=అనీల్ కపూర్ చాలా ఫన్నీ. వెల్ కమ్ బ్యాక్ సెట్స్ లో బోలెడంత ఫన్ ఎంజాయ్ చేశా.
=రీసెంటుగా రిలీజైన నా తెలుగు సినిమా (శ్రీమంతుడు?) రిజల్ట్ చూసి వెరీ గుడ్ అని నన్ను మెచ్చుకున్నారు. నా సినిమాలు చూసి క్రిటిసైజ్ చేయమని నాన్నను అడగను. ఆయన క్యాజువల్ గా అనేశారంతే.