Begin typing your search above and press return to search.
కష్టాల్లో ఉన్నావా నాయనా.. శ్రుతి ఉందిగా!
By: Tupaki Desk | 16 Aug 2015 1:37 PMకెరీర్ ఆరంభంలో శ్రుతి హాసన్ ని అందరూ ఐరెన్ లెగ్ అన్నారు. గబ్బర్ సింగ్ సినిమా కోసం ఆమెను తీసుకోబోతుంటే.. ఓ పెద్ద నిర్మాత పిలిచి మరీ ఆ అమ్మాయి ‘ఐరెన్ లెగ్’ కదయ్యా అన్నాడని హరీష్ శంకర్ ఆవేదన వ్యక్తం చేసిన గుర్తుండే ఉంటుంది. ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు శ్రుతి హిట్టు లేక కటకటలాడుతున్న హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ప్రసాదించే దేవత అయింది. తెలుగులో ఆమె ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్లు, రెండు సూపర్ హిట్లు అందుకోవడం విశేషం. ఐతే ఈ ఐదింట్లో నాలుగు సినిమాల హీరోలు శ్రుతితో సినిమా చేయడానికి ముందు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు.
శ్రుతి కెరీర్ ను మలుపు తిప్పిన ‘గబ్బర్ సింగ్’ సినిమానే తీసుకుంటే దానికి ముందు పవన్ కళ్యాణ్ పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు. పదేళ్లపాటు తన స్థాయికి తగ్గ హిట్టు లేదు. పవన్ చివరి సినిమా ‘పంజా’ డిజాస్టర్ అయింది. శ్రుతి హీరోయిన్ గా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ రాత మారిపోయింది. ఆ తర్వాత ‘బలుపు’ ముందు రవితేజ సంగతేంటో తెలిసిందే. అరడజను దాకా ఫ్లాపులు తిని చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడు. శ్రుతితో జతకట్టగానే మాస్ రాజా రాత మారిపోయింది. అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో..’ లాంటి ఫ్లాప్ తర్వాత శ్రుతితో కలిసి చేసిన ‘రేసుగుర్రం’ అతడి కెరీర్లోనే అతి పెద్ద హిట్టుగా నిలిచింది. తాజాగా మహేష్ కూడా శ్రుతి చేయి అందుకోగానే సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. 1, ఆగడు సినిమాలతో దెబ్బ మీద దెబ్బ తిన్న మహేష్ కు.. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ప్రసాదించింది శ్రుతి దేవత. రామ్ చరణ్ తో కూడా ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చింది శ్రుతి. ఐతే దానికి ముందు చరణ్ ఫ్లాపుల్లో ఏమీ లేడు. ఐతే ఒక్క ఎన్టీఆర్ విషయంలో మాత్రమే శ్రుతి సెంటిమెంటు పని చేయలేదు. ‘రామయ్యా వస్తావయ్యా’ చేదు అనుభవాన్ని మిగిల్చింది.