Begin typing your search above and press return to search.
శృతికి అన్నీ అలాంటి క్యారక్టర్లే
By: Tupaki Desk | 12 March 2016 3:30 PM GMTబాలీవుడ్ లో ఎలాగైనా సరే టాప్ లెవెల్ కు ఎదిగేయాలని చూస్తోంది శృతి హాసన్. కాని అలా నెం.1 అవ్వాలంటే మాత్రం.. అక్కడ మాంచి మాంచి సినిమాలే పడాలి. అంతేకాని ప్రతీ సినిమాలో ఒకటే టైపు పాత్రల్లో మెరిస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు.
అప్పట్లో డి-డే అనే సినిమాలో ఏదో సూపర్ పాత్ర అనుకుంటే.. ఒక వేశ్య రోల్ లో ఒక పాటలో మెరిసి వెంటనే చచ్చిపోతుంది. ఆ తరువాత తేవర్ సినిమాలో ఐటెం సాంగ్. మొన్నామధ్యన గబ్బర్ ఈజ్ బ్యాక్.. వెలకమ్ బ్యాక్.. వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించినా కూడా.. అమ్మడు బ్యాక్ బెంచీకే పరిమితం అయిపోయింది కాని.. ఆ సినిమాల సక్సెస్ లతో పెద్దగా వచ్చేసింది ఏమీ లేదు. ఇప్పుడేమో రాకీ హ్యండ్సమ్ సినిమాతో వస్తోంది. ఈ సినిమాలో అయినా ఏదైనా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోందా అంటే.. అక్కడ కూడా సేమ్ టు సేమ్. అక్కడ కూడా ఒక పాటలో మెరిసి.. రొమాన్స్ చేసి.. ప్రెగ్నంట్ అయ్యాక.. పాప పుట్టాక.. చచ్చిపోతుంది.
అసలు మరీ ఇలాంటి చిన్న చిన్న రోల్స్ కోసం అక్కడ ఎగబడే బదులు.. చక్కగా నెత్తిమీద పెట్టుకుంటున్న తెలుగు అండ్ తమిళ ఇండస్ర్టీలలో ట్యాలెంట్ చూపించవచ్చుగా శృతి??!!