Begin typing your search above and press return to search.
శృతి డిఫరెంట్.. నేనింతే టైప్!
By: Tupaki Desk | 28 Aug 2018 10:15 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన శృతిహాసన్ వరుసగా రెండు మూడు చిత్రాలు నిరాశ పర్చడంతో ఐరెన్ లెగ్ ముద్రను మోయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే పవన్ తో నటించిన ‘గబ్బర్ సింగ్’ ఈమెకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తెచ్చి పెట్టింది. అప్పటి నుండి శృతిహాసన్ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు - తమిళం - హిందీ ఇలా మూడు భాషల్లో కూడా కమల్ కూతురు అనే ముద్రను చెడిపేసి శృతిహాసన్ అంటూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఎవరేం అనుకున్నా, ఎవరు ఎలా రాసినా నేను నాలాగే ఉంటాను అనే మనస్థత్వం శృతిహాసన్.
శృతిహాసన్ తల్లిదండ్రులు కమల్ - సారికలు చాలా సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నారు. అయినా కూడా శృతిహాసన్ మాత్రం ఇద్దరితో చాలా సన్నిహితంగా ఉంటుంది. చెన్నై వచ్చినప్పుడు కమల్ ను వదిలి ఉండదు. తండ్రికి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరగా ఉండి చూసుకుంటుంది. ఇక ముంబయికి వెళ్తే అమ్మ కొంగు వదిలి పెట్టదు. తండ్రితో కలిసి పలు చిత్రాలకు వర్క్ చేసిన శృతిహాసన్ ప్రస్తుతం అమ్మతో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటుంది. ఇటీవలే అమ్మ సారికతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభింపజేసింది. ప్రస్తుతం అందులో చిత్ర నిర్మాణం జరుగుతుంది. తాజాగా రాఖీ పండుగ సందర్బంగా తన ఆత్మీయురాలు అయిన అమ్మ సారికకు రాఖీ కట్టి పండుగ జరుపుకుంది. తనకు అన్న - అక్క అన్ని అమ్మ అవ్వడం వల్లే అమ్మకు రాఖీ కట్టాను అంటూ చెప్పుకొచ్చింది. అమ్మకు రాఖీ కట్టిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి - శృతి డిఫరెంట్ అనిపించుకుంది.
ఇక సోషల్ మీడియాలో శృతిహాసన్ గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈమె లండన్‌కు చెందిన ఒక కుర్రాడితో ప్రేమలో పడటం జరిగింది. ప్రేమ విషయంలో మరియు ఎక్స్ పోజింగ్ విషయంలో ఈమెపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువగా వస్తాయి. స్టార్ హీరో కూతురు అనే విషయం మర్చిపోయి ఈమె ఎక్స్ పోజింగ్ చేస్తుందంటూ కొందరు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా నేను ఇంతే, నాకు అనిపించింది చేస్తాను అంటూ ఈమె ముందుకు వెళ్తుంది. గత కొన్ని రోజులుగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న శృతి తాజాగా హిందీలో ఒక చిత్రం చేస్తోంది. మళ్లీ తెలుగు మరియు తమిళంలో కూడా బిజీ అవుతాను అంటుంది.