Begin typing your search above and press return to search.
రాణి అంటూ ఎంత ప్రేమ పొంగించింది
By: Tupaki Desk | 12 Oct 2015 2:44 PM GMTమిలమిల మెరిసే మేనిఛాయతో.. కలువల్లాంటి కళ్లతో ఒక్కసారి చూస్తే చాలు జన్మధన్యమయ్యేటట్లు ఉండే బుట్టబొమ్మ అక్షర హసన్. ఆమె అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో యూత్ కి పిచ్చెక్కించే శ్రుతి హసన్ చూస్తే మైండ్ బ్లోయింగే. వాలు చూపుల కన్నా.. కోపంతో ముద్దుగుమ్మ ముఖం జేవురిస్తే మరింత ముద్దుముద్దుగా ఉండటం శ్రుతికే చెల్లు.
ఇక.. ఇద్దరూ కానీ కలిసి నడిచి వస్తుంటే.. ఎవరి వంక చూడాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఇంత అందాన్ని తీర్చిదిద్దిన బ్రహ్మను గుర్తు తెచ్చుకుంటూ.. వారిని మరి కాసేపు చూసే అవకాశం ఇవ్వు దేవుడా అని కోరుకోకుండా ఉండలేరు. అలాంటి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పటికే స్ర్కీన్ మీద తమ సత్తా చాటి చెప్పారు.
తెర మీద కనిపించేకన్నా తెర వెనుక ఉండి పని చేసుకోవటంలోనే సుఖం ఉందని డిసైడ్ అయినా.. మనసు మార్చుకొని ఎంతోమంది కలల రాణిగా మారిన అక్షరహాసన్ బర్త్ డే ఈ రోజు. చిట్టి చెల్లెలు పుట్టినరోజు సందర్భంగా.. తనకున్న టన్నుల టన్నుల ప్రేమను ట్విట్టర్ ట్వీట్ల ద్వారా కుమ్మరించేసింది అక్క శ్రుతి హసన్.
తన రాణిగా చెల్లెమ్మ గురించి చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ.. తన రాణి సాధిస్తున్న విజయాల్ని చూసి గర్వపడుతుంటానని చెప్పటమే కాదు.. తనను ఇంత ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేసిన అభిమాన గణానికి కూడా థ్యాంక్స్ చెప్పేసి.. తాను అందరి గురించి ఆలోచిస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. మొత్తానికి చెల్లెలు మీద ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తూ.. అక్కంటే ఇలా ఉండాలన్నట్లుగా వ్యవహరించిన శ్రుతిహసన్ మాటలు చూస్తే మురిసిపోవాల్సిందే.