Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బ్యూటిఫుల్ లేడీ గబ్బర్ సింగ్

By:  Tupaki Desk   |   24 Jun 2019 5:30 AM GMT
ఫోటో స్టొరీ: బ్యూటిఫుల్ లేడీ గబ్బర్ సింగ్
X
తండ్రి కమల్ హాసన్ లాగే శృతి హాసన్ కూడా మోడరన్ థింకింగ్ ఉండే వ్యక్తి. జనాలేమనుకుంటారో అని ఊరుకోకుండా తనకు నచ్చిన పని చేసేస్తుంది. అందుకే కెరీర్ లో పీక్స్ లో ఉండే సమయంలో లవ్ లో పడడం.. సూపర్ కెరీర్ ను వదిలేసి ఇంటర్నేషనల్ సింగర్ గా మారేందుకు లండన్ కు మకాం మార్చడం చేయగలిగింది. అటు లవ్వు .. ఇటు సింగింగ్ కెరీర్ అనుకున్నట్టు సాగకపోవడంతో మళ్ళీ ఇండియా కు తిరిగొచ్చి హీరోయిన్ కెరీర్ కొనసాగిస్తోంది. బ్రేకప్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడేసి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది.

శృతి సినిమాలు చేసినప్పుడు.. గ్యాప్ ఇచ్చిన సమయంలోనూ.. ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడంతో శృతిపై జనాల ఫోకస్ కాస్త ఎక్కువైంది అంతే. తాజాగా శృతి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "బ్లాక్ అనేది లేని రోజు.. అసలు ఇదెలా జరిగిందబ్బా." శృతికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం. మరి అలాంటి భామ బ్లాక్ అనేది లేకుండా లైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని పోజిచ్చింది. చేతికి పెట్టుకున్న వాచ్.. వేళ్ళకు పెట్టుకున్న ఉంగరాల్లో కూడా బ్లాక్ కలర్ కనపడడం లేదు. లిప్ స్టిక్ కూడా పింక్. అందుకే తనకు తానే సర్ ప్రైజ్ అయినట్టుంది. ఏదైతేనేం.. ఈ ఫోటోలో మునుపటిలా స్లిమ్ముగా.. స్టైలిష్ గా ఉంది. మంచి స్మైల్ తో పోజిచ్చింది.

అందుకే నెటిజన్లు ఈ ఫోటోకు తమ లైకులతో జేజేలు పలికారు. "బ్లాక్ ఎందుకు బ్యూటీ.. పింక్ లో క్యూట్ గా ఉన్నావు".. "సూపర్ స్టార్ హీరోయిన్".. "క్యూట్ బ్యూటీ క్వీన్".. "బ్యూటిఫుల్ లేడీ గబ్బర్ సింగ్" అంటూ కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం శృతి విజయ్ సేతుపతితో 'లాబం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో 'పవర్' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు.