Begin typing your search above and press return to search.

నెంబర్ వన్ ర్యాంకు కట్టబెట్టేయొచ్చా?

By:  Tupaki Desk   |   10 Aug 2015 1:47 PM GMT
నెంబర్ వన్ ర్యాంకు కట్టబెట్టేయొచ్చా?
X
తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరో చెప్పడం అంత వీజీ కాదు. పోటీలో ఐదారుగురు హీరోలున్నారు. కష్టపడి సార్ట్ అవుట్ చేసినా.. చివరికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. వీళ్లిద్దరిలో ఎవరినీ తక్కువ చేయలేం.. మళ్లీ ఫ్యాన్స్ తో పెద్ద గొడవ మొదలవుతుంది కాబట్టి హీరోల్లో నెంబర్ వన్ ఎవరో తేల్చే పని పక్కనబెట్టేయడం బెటర్. ఐతే హీరోయిన్ల విషయంలో మనకా ఇబ్బందేమీ ఉండదు. ఎంచక్కా సక్సెస్ రేట్ ను బట్టి నెంబర్ వన్ ఎవరో తేల్చేయొచ్చు. రెండేళ్ల ముందు వరకు కాజల్ అగర్వాల్, సమంతల మధ్య నెంబర్ వన్ కోసం గట్టి పోటీ నెలకొంది. అనుష్క, తమన్నా కూడా రేసులో ఉన్నా ప్రధానంగా వాళ్లిద్దరి మధ్యే పోటీ. కొంతకాలం కాజల్ హవా సాగితే.. ఇంకొంత కాలం సమంత జోరు చూపించింది.

ఐతే ఇప్పుడు పైన చెప్పుకున్న నలుగురినీ కొట్టేసి శ్రుతి హాసన్ నెంబర్ వన్ రేసులో దూసుకెళ్తోంది. కెరీర్ ఆరంభంలో అనగనగా ఓ ధీరుడు, ఓమై ఫ్రెండ్ లాంటి ఫ్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న శ్రుతి.. ఇప్పుడు గోల్డెన్ గర్ల్ అనిపించుకుంటుందో. గబ్బర్ సింగ్ తో తిరిగిన ఆమె సుడి.. ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఒక్క ‘రామయ్యా వస్తావయ్యా’ను మినహాయిస్తే గబ్బర్ సింగ్ దగ్గర్నుంచి ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. గత రెండేళ్లలో బలుపు, రేసుగుర్రం లాంటి హిట్లు కొట్టిన శ్రుతి తాజాగా ‘శ్రీమంతుడు’తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని నెంబర్ వన్ కిరీటాన్ని లాగేసుకుంది. మరోవైపు సమంత, కాజల్, తమన్నా ఒకప్పటి జోరు చూపించట్లేదు. అనుష్క వేరే లీగ్ లోకి వెళ్లిపోయింది. రకుల్ అవకాశాల పరంగా జోరు మీదుంది కానీ.. రాబోయే ఏడాది కాలంలో ఆమె సినిమాల ఫలితాల్ని బట్టి తనపై ఓ అంచనాకు రావచ్చు. కాబట్టి ప్రస్తుతానికి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా శ్రుతికి కిరీటం పెట్టేయొచ్చు.