Begin typing your search above and press return to search.

కంగ‌న‌లా శ్రుతికి కూడా మెంట‌ల్ హై క్యా..!

By:  Tupaki Desk   |   25 Aug 2020 5:00 AM GMT
కంగ‌న‌లా శ్రుతికి కూడా మెంట‌ల్ హై క్యా..!
X
ప్రతి ఒక్కొరికి పెరిగిన నేప‌థ్యం అనేది జీవితంలో చాలా కీల‌క పాత్ర‌ను పోషిస్తుంటుంది. ఒంట‌రిత‌నం డిప్రెష‌న్ లాంటి కార‌ణాలు మ‌నిషి మెంట‌ల్ కి కార‌ణం అవుతుంటాయి. అలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాలు మాన‌సిక స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తే ఆ ఒంట‌రి యువ‌తి ఎలా ప్ర‌వ‌ర్తించింది? ఆ యువ‌తి జీవితంలో ప్ర‌వేశించిన మ‌రో మెంట‌ల్ మేన్ క‌థాక‌మామీషు ఏమిటి? అత‌డి వ‌ల్ల త‌న జీవితంలో ఏం జ‌రిగింది? అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో తెర‌కెక్కించారు `మెంట‌ల్ హై క్యా`. ఈ సినిమా టైటిల్ వివాదాస్ప‌దం కావ‌డంతో జ‌డ్జిమెంట‌ల్ హై క్యా అని మార్చారు. ఇక టైటిల్ కి త‌గ్గ‌ట్టే పిచ్చి చేష్ఠ‌ల్ని ప్ర‌ద‌ర్శించే యువ‌తిగా కంగ‌న ర‌నౌత్ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

అంతేకాదు.. కంగ‌న వేష‌ధార‌ణ‌తో పాటు మెంట‌ల్ కి త‌గ్గ‌ట్టే త‌న రూపాన్ని డిజైన్ చేసుకోవ‌డం ఇంట్రెస్టింగ్‌. డార్క్ లిప్ స్టిక్ .. థిక్ కాటుక‌.. ఐ లైన‌ర్ ప్ర‌తిదీ సంథింగ్ వెరైటీనే. ఇదిగో ఇక్క‌డ చూస్తున్న శ్రుతిహాస‌న్ స‌న్నివేశం కూడా ఇంచుమించు అలానే ఉన్న‌ట్టుంది మ‌రి. కావాల‌నే చేస్తోందా.. లేక త‌న మాన‌సిక ప‌రిస్థితిని వ్య‌క్త‌ప‌రిచే ప్ర‌య‌త్న‌మా? మొత్తానికి ఈ రూపం చూడ‌గానే అంద‌రూ షాక్ తింటున్నారు.

డార్క్ లిప్ స్టిక్ తో విచిత్ర‌మైన ఆహార్యంతో బెదిరించేస్తోంది శ్రుతి. పాశ్చాత్య ధోర‌ణి ప‌క్కాగా క‌నిపిస్తోంది త‌న యాటిట్యూడ్ లో. ఏదైతేనేం.. యూత్ ని ఆక‌ర్షించేందుకు సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకునేందుకు ఇలాంటి వేషాలే అవ‌స‌రం. ఇక ఈ ఫోటో చూడ‌గానే శ్రుతికి కూడా మెంట‌ల్ హై క్యా! అంటూ కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు. కంగ‌న‌ను మించి మెంట‌ల్ వేషాలేస్తోంద‌నేది కుర్రాకారు కామెంట్‌. 34 ఏజ్ లో శ్రుతి ఈ వేషాలు చూస్తుంటే భ‌యం వేస్తోందంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయ్. `మండే మూడ్` అంటూ అంద‌రికీ మూడ్ చెడ‌గొట్టేసింది .. ప్ఛ్!