Begin typing your search above and press return to search.
పాశ్చాత్య పిచ్చి మేకప్.. ఏంటో శ్రుతి కాంటెస్ట్?
By: Tupaki Desk | 19 May 2021 12:30 PM GMTమేకప్ .. వేషధారణ విషయంలో భారతీయతకు పూర్తి భిన్నమైనది పాశ్చాత్య ధోరణి. బ్యాంకాక్ - థాయ్ ల్యాండ్ - హాంకాంగ్ లో ఈ తరహా విచ్చలవిడి సంస్కృతి కనిపిస్తుంది. ఎంచుకునే కాస్ట్యూమ్స్.. మేకప్ విధానం ప్రతిదీ వింతగానే కనిపిస్తాయి భారతీయులకు. హాలీవుడ్ సినిమాలతో పాప్ కల్చర్ తో ఇది అన్నిచోట్లా సుపరిచితమే అయినా కానీ.. దానిని డైజెస్ట్ చేసుకోవడం అంత సులువేమీ కాదు. వెరైటీని ఇష్టపడే పాశ్చాత్య పిచ్చిలో ఉన్న యువతరం తప్ప సాంప్రదాయ వాదులు అస్సలు అంగీకరించలేరు.
ఇటీవల శ్రుతిహాసన్ మేకప్ ప్రయోగాలు చూస్తే కచ్ఛితంగా ఇది పూర్తిగా భారతీయతకు విరుద్ధం అని భావిస్తారు. వింత వికృత వేషధారణను మేకప్ పర్యవసానాన్ని ఏమాత్రం మొహమాటపడక ప్రెజెంట్ చేయడం తన మానసిక స్థితికి ఆధునికతకు అద్దం పడుతుందన్న వ్యాఖ్యలు వినిపించాయి. టాట్టూలు పచ్చబొట్ల కల్చర్ వరకూ ఓకే కానీ వింతైన మేకప్ లతో భయపెట్టేస్తే మాత్రం అది ఇబ్బందికరం అనేది ఒక వర్గం వాదన. కానీ ఇప్పుడు అలాంటి వెస్ట్రన్ మేకప్ కి భారతదేశంలో ప్రాచుర్యం తెస్తున్నానని చెబుతోంది శ్రుతి. ఇక్కడ అంగీకరించేందుకు ఇష్టపడరు అంటూనే ఒక కాంటెస్ట్ ని ప్లాన్ చేస్తోంది.
గోతిక్ మేకప్ పై అపార ప్రేమను కనబరిచే శ్రుతి ఇటీవల అమెరికన్ గాయని.. నటి మెకెంజీ వెస్ట్ మోర్ సహకారంతో #McKenziesmakeupchallenge ను ప్రారంభించింది. ఛాలెంజ్ అంశం బ్యూటిఫుల్ గోతిక్ మేకప్. సృజనాత్మక గోతిక్ రూపాన్ని ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంట్రీలను శ్రుతి బృందం ఆహ్వానిస్తుంది. ``గోత్ లుక్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. మెకెంజీస్ ఛాలెంజ్ నిజంగా మంచి వినూత్న వేదిక. నేను దానిలో భాగం కావడం ఆనందంగా ఉంది`` అని ఆమె చెప్పింది.
ఇప్పటివరకు అందుకున్న ఎంట్రీల గురించి మాట్లాడుతూ.. ఉప సంస్కృతి గురించి పెద్దగా తెలియని వారు చాలా మంది ఉన్నారు. వారు కుతూహలంగా ఉన్నారు. ఎక్కువగా ఇది చాలా సరదాగా సానుకూలంగా ఉన్నారు. అయితే భారతీయ గ్లామర్ పరిశ్రమలో పాప్ సంస్కృతిలో భాగమైన గోతిక్ లుక్ ని ఇంకా అంగీకరించలేదు. ఏదేమైనా.. ఒక నిర్దిష్ట రూపం ఒకరి వ్యక్తిత్వానికి పొడిగింపు అయితే.. ప్రజలు చివరికి దాని వైపు ఆకర్షితులవుతారని శ్రుతి భావిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రభాస్ సరసన `సాలార్`లో శ్రుతి నటిస్తోంది. తమిళంలోనూ సేతుపతి తో కలిసి ఓ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.