Begin typing your search above and press return to search.
ఏంటి శ్రుతీ.. ఇకనైనా వారిని వదిలేస్తావా?
By: Tupaki Desk | 29 July 2022 11:30 PM GMTలోకనాయకుడు, సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ గడప తొక్కిన శ్రుతి హాసన్.. 'లక్' అనే హిందీ మూవీతో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత శ్రుతి హాసన్ తమిళ్, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేసింది. కానీ, అవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. శ్రుతి హాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసి ట్రోల్ చేశారు.
ఇక హీరోయిన్ గా శ్రుతి హాసన్ కెరీర్ కష్టమే అనుకుంటున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'గబ్బర్ సింగ్' మూవీ చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ మూవీ అనంతరం టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి.. ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో బ్రేకప్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది.
2015లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'లో చివరిగా మెరిసిన శ్రుతి హాసన్.. దాదాపు ఐదేళ్లు కనిపించలేదు. అయితే మళ్లీ 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చిన ఆమె.. ఆ వెంటనే 'వకీల్ సాబ్'తో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినీయల్ హీరోలతో నటించేందుకు ఎక్కువగా సై అంటోంది. ఈమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే మూవీ చేస్తోంది.
అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణతో 'ఎన్‌బీకే 107'లో నటిస్తోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. మరోవైపు యంగ్ డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'మెగా 154'లోనూ శ్రుతీ హీరోయిన్ గా ఖాయమైంది. ఇటీవల కాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. నిర్మాతలు సీనియర్ హీరోల కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ హీరోయిన్లను తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరోలతో శ్రుతి హాసన్ జతకట్టేందుకు మొగ్గు చూపుతుందని గుసగుసలు వినిసిస్తున్నాయి. ఏదేమైనా ఆకట్టుకునే అందం, టాలెంట్, మంచి సక్సెస్ రేటు ఉన్నప్పటికీ.. శ్రుతి హాసన్ యంగ్ హీరోలతో కాకుండా సీనియర్ హీరోలతో కలిసి నటించడం ఆమె అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇలానే తన నాన్న వయసు ఉన్న హీరోలతో జతకటడం కంటిన్యూ చేస్తే శ్రుతి క్రేజ్ కు గట్టి దెబ్బ పడటం ఖాయమని.. యంగ్ స్టార్స్ నుండి ఆఫర్లు తగ్గే అవకాశాలు అత్యధికంగా ఉంటాయని అభిమానులు కలవర పడుతున్నారు. మరి ఇకనైనా శ్రుతి హాసన్ సీనియర్ హీరోలను వదిలేస్తుందో..లేదో..చూడాలి.