Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ సర్జరీ నిజమేనట.. మందు కూడా మానేసిందట

By:  Tupaki Desk   |   2 March 2020 4:19 AM GMT
ఆ బ్యూటీ సర్జరీ నిజమేనట.. మందు కూడా మానేసిందట
X
సదూరన ఉండే తారలు ఉరిస్తుంటారు. తామెంతో అభిమానించి.. ఆరాధించే వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవటానికి సామాన్యులు చూపించే ఉత్సాహం.. ఆత్రుత అంతా ఇంతా కాదు. అలాంటి తార.. తనకు సంబంధించిన పర్సనల్స్ ను ఓపెన్ గా షేర్ చేసుకోవటం కాస్త తక్కువే. కానీ.. తాజాగా మల్లె మొగ్గ లాంటి శ్రుతిహసన్ తనకు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది.

ఒక మీడియాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యారు. అగ్రహీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా ఉన్న శ్రుతి.. సరైన హిట్లు పడకపోవటం.. ఛాన్సులు తగ్గిపోవటం తెలిసిందే. అదే సమయంలో లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖల్ కోర్సేల్ తో డేటింగ్ చేసింది. కొంత కాలానికే వీరిద్దరి రిలేషన్ బ్రేకప్ స్టేటస్ కు అప్డేట్ అయ్యింది కూడా. అప్పటి నుంచి సింగిల్ గా ఉంటున్న ఆమెకు ఆరోగ్యం సరిగా లేదన్న వార్తలు వచ్చాయి.

ఇటీవల ఆమె సర్జరీ చేసుకుందన్న మాట వినిపించింది. తాను సర్జరీ చేయించుకున్న మాట నిజమేనని చెప్పేసింది శ్రుతి. శారీరకంగా.. మానసికంగా వేధించే హర్మోనల్ సమస్యలు తనకు ఉన్నాయని.. అందుకే తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పింది. తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని.. ఒకప్పుడు తాను తాగుతుండేదాన్నని.. కొన్ని కారణాలతో తాగ కూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

ప్రస్తుతం తాను తాగటం మానేసినట్లుగా పేర్కొంది. తన ఆరోగ్యం కూడా సరిగా ఉండని నేపథ్యంలో తాను తాగుడుకు దూరంగా ఉన్నట్లు చెప్పింది. తాగటం మానేసిన తర్వాత తన ఆరోగ్యం చాలా బాగుందని చెప్పింది. ఒత్తిడి నుంచి రిలీఫ్ కావటానికో.. మరో కారణంతోనో డ్రింక్ చేసే ముద్దుగుమ్మలకు శ్రుతి చెబుతున్న మాటల్ని వింటున్నారా?