Begin typing your search above and press return to search.

మహేష్‌ తో లవ్‌ లో ఓ ట్విస్టుంది -శ్రుతి

By:  Tupaki Desk   |   7 Aug 2015 4:00 AM GMT
మహేష్‌ తో లవ్‌ లో ఓ ట్విస్టుంది -శ్రుతి
X
నిజజీవితంలో ప్రేమ లో పడే అవకాశమే లేదని తేల్చి చెప్పేసిన శ్రుతిహాసన్‌ వెండితెరపై ఇట్టే ప్రేమలో పడిపోయింది. అందునా అందగాడు ప్రిన్స్‌ మహేష్‌ తో ప్రేమలో పడిపోయింది. అదంతా శ్రీమంతుడు చిత్రం కోసమే సుమీ.. ఆ సంగతినే శ్రుతి ముచ్చటిస్తూ... ఈ చిత్రంలో చారుశీల అనే మోడ్రన్‌ అమ్మాయిగా నటించాను. పల్లెటూరిలోనే ఉన్నా.. ఇండివిడ్యువల్‌ ఆలోచనలు ఉన్న అమ్మాయిగా, సాంప్రదాయ కుటుంబంలోని విలువల్ని ఆవిష్కరించే అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్ర పేరు చారుశీల. బిలియనీర్‌ హర్ష తో లవ్‌ లో పడుతుంది. అయితే ఆ లవ్‌ లో ఓ చిన్న ట్విస్టుంది. అదేంటో తెరపైనే చూడాల్సిందే.

అసలు విదేశాల్లో ఉండే బిలియనీర్‌ కి, ఓ పక్కా పల్లె పడుచుకి మధ్య లవ్‌ ఎలా కుదిరింది? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్రని కొరటాల నేరేట్‌ చేసినప్పుడు థ్రిల్‌ కి గురయ్యాను. మహేష్‌ తో నటించాలన్నది నా చిరకాల స్వప్నం. ఎంతో కాలంగా వేచి చూశాక కానీ ఈ అవకాశం దక్కలేదు. ప్రిన్స్‌ సింప్లీ సూపర్బ్‌. అతడు లుక్‌ లోనే కాదు మనసులోనూ ప్రిన్సే.. అంటూ చాలా సంగతులే ముచ్చటించింది శ్రుతి. శ్రీమంతుడులో మహేష్‌ కి నాకు మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు చాలా సెన్సిటివ్‌ గా తీర్చిదిద్దారని శ్రుతి చెప్పింది. ఇకపోతే సినిమాలు తన ఫ్యాన్సు తన నుండి ఆశించే డ్యాన్సులు ఇరగదీశానంటూ స్మయిల్‌ ఇచ్చిందీ బంగారం.