Begin typing your search above and press return to search.
ఎవ్వరూ గుర్తుపట్టకుండా తిరుమలకు...
By: Tupaki Desk | 11 April 2015 4:59 AM GMTపనే దైవం అని నమ్మే హీరోల్లో విలక్షణ నటుడు, పద్మశ్రీ కమల్‌హాసన్ ఒకరు. చేసే పనిలోనే దైవాన్ని చూసుకోవాలని తపించే హీరో అతడు. అందుకే దేవుడి కోసం ప్రత్యేకించి గుడికి వెళ్లాలా? వద్దా? అనే విషయంలో ఆయన పెద్దగా స్పందించడు. నాస్తికత్వం కాదు.. ఎక్కువగా పనిమీద శ్రద్ధ పెట్టడం వల్లే కాస్త దేవునికి దూరమయ్యానని చెబుతుంటారు కమల్‌హాసన్.
లేచినా, కూచున్నా, నిదురించినా, కలగన్నా అది సినిమా గురించి తప్ప ఇక వేరే దేనిగురించి ఆలోచించరు. అంతగా లీనమయ్యేవారికి పుణ్యక్షేత్రాలు దర్శించేంత టైమెక్కడుంటుంది? అయితే అతడి నటవారసురాలు శ్రుతిహాసన్ మాత్రం అందుకు కాస్త విరుద్ధంగానే నడుచుకుంటోంది. తండ్రిని మించిన తనయగా తను కూడా అంతే బిజీగా ఉంటూనే, దైవానికి ఇవ్వాల్సినంత స్పేస్ ఇస్తోంది. ప్రస్తుతం శేషాచల అడవుల్లో విజయ్‌తో సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న ఈ అమ్మడు తిరుమలేశుని దర్శనానికి వెళ్లింది.
వీఐపీ కోటాలో వెంకటేశుని సన్నిధికి వెళ్లి వచ్చింది శృతి. అలా వెళ్లేప్పుడు ఓ సాదాసీదా భక్తురాలిలాగా వెళ్లి వచ్చింది. అయితే తనని ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఓ కొత్తరకం కళ్లజోడు పెట్టుకుని, నిండా కప్పుకున్న చీరలో వెళ్లింది. ఓ రకంగా తనని స్టార్ అని గుర్తుపట్టలేనంత కొత్తగా వెళ్లింది అంటే అతిశయోక్తి కాదు. శ్రుతినా మజాకానా?