Begin typing your search above and press return to search.
గతంలో తెలియని సీక్రెట్స్ తెలిశాయ్
By: Tupaki Desk | 14 Dec 2016 11:30 AM GMT100 కోట్ల వసూళ్లను సాధించిన మూవీలో నటించినా.. శృతి హాసన్ కెరీర్ బాలీవుడ్ లో పరుగులు పెట్టే పరిస్థితిలో లేదు. అలాగని అవకాశాల కోసం వెంటబడ్డం కూడా శృతి కేరక్టర్ కాదు. తన కేరక్టర్ కు గత ఇంపార్టెన్స్ ను చూసుకుంటూ.. కాంబినేషన్స్ విషయంలో ఒక్కోసారి షాకింగ్స్ ఇస్తూంటుంది శృతి. ప్రస్తుతం 'బెహెన్ హోగీ తేరీ' చిత్రంలో రాజ్ కుమార్ రావ్ కు జోడీగా నటిస్తోంది ఈ సౌత్ బ్యూటీ.
స్క్రిప్ట్ లో ఫ్రెష్ నెస్ కారణంగానే ఈ సినిమా అంగీకరించానంటున్న శృతి హాసన్.. రియల్ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురైతే ఎంత సింపుల్ గా హ్యాండిల్ చేస్తామో.. అంత ప్యూర్ గా ఈ సినిమా ఉంటుందని చెప్పింది. తన కేరక్టర్ ఫన్నీ గానే కాదు.. సెన్సిటివ్ పాత్ర అంటున్న శృతి హాసన్.. కొత్త కాంబినేషన్స్ ట్రై చేయడంలో తనకు థ్రిల్ ఉంటుందని అంటోంది. అంచనాలను బ్రేక్ చేస్తూ.. ఆడియన్స్ కు కొత్తదనం అందించడమే తన ఉద్దేశ్యంగా చెబుతోంది ఈ చెన్నై బ్యూటీ.
చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే రకరకాల కల్చర్స్ ఉండడంతో.. ఇప్పుడు సౌత్-నార్త్ సినిమాల మధ్య బ్యాలెన్స్ చేయడం అంత కష్టం కావడం లేదన్నది ఈమె ఫీలింగ్. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఇష్టమంటోంది శృతి హాసన్. ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నానని చెప్పిన శృతి.. సూర్య.. పవన్ కళ్యాణ్ లతో వర్క్ చేస్తున్నట్లు తెలిపింది. ఇధ్దరు బడా స్టార్లతో ఒకేసారి వర్క్ చేయడం క్రేజీ ఫీలింగ్ అంటోంది శృతి.
ఈ ఏడాది తన లైఫ్ లో చాలా ముఖ్యం అంటున్న శృతి హాసన్.. గతంలో తనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నట్లు చెప్పింది. తనకు నచ్చిన నచ్చనివాటిలో మరింత కఠినంగా వ్యవహరించేలా మనస్తత్వం అలవరచుకుందట. ఇక ముప్ఫైల్లోకి అడుగుపెట్టడం కూడా గ్రేట్ ఫీలింగ్ అని చెప్పిన శృతి హాసన్.. మ్యూజిక్ రంగంలో కూడా అడుగులు ముందుకు వేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/