Begin typing your search above and press return to search.

చెప్పను.. ఎందుకు చెప్పాలంటున్న శృతి

By:  Tupaki Desk   |   4 July 2017 2:09 PM GMT
చెప్పను.. ఎందుకు చెప్పాలంటున్న శృతి
X
సౌత్ బ్యూటీ శృతి హాసన్ కొంతకాలం క్రితం వరకూ ఫుల్ జోష్ లో ఉంది. తెలుగు.. తమిళ్.. హిందీ.. ఇలా తను నటించిన అన్ని భాషల్లోను ఒకే ఏడాది 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి మాంచి హుషారు చూపించింది. కానీ ఇప్పుడీ బ్యూటీ పరిస్థితి బాగా డల్ అయింది. ఒకవైపు చేసిన ఆడడం లేదు.

ఎన్నో హోప్స్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు.. హిందీలో బెహన్ హోగీ తేరీ వంటి సినిమాలు బాల్చీ తన్నేశాయి. మరోవైపు ఈ భామ ఫిజిక్ నుంచి బిహేవియర్ వరకూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నా బాడీ నా ఇష్టం అంటూ విసుక్కుంటోంది కూడా. మరో వైపు మైకేల్ కోర్సలేతో ప్రేమ వ్యవహారంపై కూడా బాగానే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఈ భామను బాగా విసుకు తెప్పించేస్తున్నాయి. ఫ్లాపుల మహత్యమో ఏమో కానీ.. ఏమడిగినా శృతి హాసన్ కు తెగ కోపం వచ్చేస్తోంది.

రీసెంట్ గా ఇలాంటి ప్రశ్నకు.. 'కొందరు జీవితానికి అండగా ఉంటారు.. మరికొందరు తోడుగా ఉంటారు. అయినా నా పర్సనల్ విషయాలు అయిన వాటి గురించి అందరికీ ఎందుకు చెప్పాలి. ఇలా చెప్పడం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. పెళ్లి విషయమై ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదు. చేసిన ప్లాన్స్ సక్సెస్ కాకపోవడంతో.. ఇకపై ప్లాన్ చేయాలని అనుకోవడం లేదు' అంటూ గట్టిగానే చెప్పింది కమల్ కూతురు శృతి హాసన్.