Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కూతురికి నో పాలిటిక్స్
By: Tupaki Desk | 20 Feb 2018 11:30 PM GMTసీనియర్ స్టార్ హీరోల కూతుళ్లలో ఎక్కువ స్టార్ డమ్ అందుకున్న వారిలో శృతి హాసన్ టాప్ లో ఉందని అందరికి తెలిసిన విషయమే. కోలీవుడ్ టాలీవుడ్ లో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే శృతి పై గత కొంత కాలంగా ఒక నేషనల్ రూమర్ ఎక్కువగా వస్తోంది. బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ అనుకుంటే పొరపాటే. అది కాకుండా ఇంకా ముఖ్యమైన మ్యాటర్ ఏంటని అనుకుంటున్నారా?. పాలిటిక్స్ లోకి శృతి ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వస్తోంది.
తన తండ్రి కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత ఆయనకు అండగా ఉండాలని ఆమె కొన్ని ప్రణాళికలతో సిద్ధమవుతోందని కోలీవుడ్ లో ప్రచారం బాగానే సాగింది. అయితే మ్యాటర్ ఎక్కువగా వైరల్ కాకముందే శృతి క్లారిటీ ఇచ్చింది. నాకు రాజకీయాలు ఏ మాత్రం తెలియవు. డాడీ తో పాటు పాలిటిక్స్ లో మద్దతు తెలిపేందుకు వెళుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నా ద్రుష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. ఆయన పార్టీలో చేరడం లేదు. కానీ డాడీ రాజకీయ ప్రయాణానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు శృతి తెలిపింది.
అయితే కమల్ హాసన్ ఈ నెల 21న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కాలం సమాధి సాక్షిగా రాజకీయ పార్టీ పేరును అధికారికంగా తెలియజేయనున్నారు. అయితే ఈ వేడుకకు కూడా శృతి రాలేనని చెప్పింది. ఎందుకంటే ఆ రోజు షూటింగ్స్ ఉన్నాయని తెలిపింది. మరి ఇంతలా రాజకీయాలను తాకను అంటోన్న శృతి కనీసం ఓటు హక్కు అయినా వినియోగించుకుంటుందో లేదో..?