Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శృతి సోయగాలు

By:  Tupaki Desk   |   5 Jun 2017 10:35 AM GMT
ఫోటో స్టోరి: శృతి సోయగాలు
X
శ్రుతి హాసన్ ఇప్పుడు హిందిలోను తమిళ్లోనూ మాటిమాటికీ వార్తల్లోకి వస్తోంది. భారీ బడ్జెట్ ‘సంగమిత్ర’ లో ప్రధాన పాత్ర నుండి తప్పుకొని మీడియాలో సెన్సేషనల్ న్యూస్ ఐటెమ్ అయ్యింది. ఆ తరువాత బాలీవుడ్లో బెహన్ హోగీ తెరి ప్రమోషన్లతో అల్లకల్లోలం సృష్టించింది. అదేలేండి తన అందాలతోనే. ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఈవెంట్కు వచ్చి తన ఫ్యాషన్ ఔట్ ఫిట్ తో అందరి కళ్ళకి బ్లాక్ ఆపిల్ లా ఆనేసింది.

ప్రతి ఏడాది జి‌క్యూ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ళు నిర్వహిస్తున్న బెస్ట్ డ్రెస్సెడ్ అవార్డ్ ఫంక్షన్ కు ఇలా అదిరేటి లుక్ తో వచ్చి.. మ్యూజిక్ పాప్ స్టార్ తరహాలో నిలబడి.. సోయగాలను విరబూయించింది శృతి హాసన్. వెట్ హెయిర్ లుక్ తో బ్లాక్ టాప్ లో హై స్లిట్ బ్లాక్ ఔట్ ఫిట్ లో రెడ్ కార్పెట్ పైన తన స్టైల్ తో అక్కడ ఉన్న వాళ్ళంతా వావ్ అనేలా నడిచింది. సెక్స్ అప్పీల్ అండ్ స్టైల్ రెండింటిని బాగానే హాండెల్ చేసింది. ఈ పార్టీ కూడా అందుకే ప్రతి ఏడాది రెడ్ కార్పెట్ పై ఫ్యాషన్ రాంప్లా పై ఎవ్వరైతే బెస్ట్ డ్రస్ తో అందరినీ ఆకట్టుకుంటారో వాళ్ళకి అవార్డ్ ఇస్తారు. అవార్డు శృతికి రాకపోయినా.. ఆమె లుక్కుతో కుర్రాళ్ళకు మాత్రం జ్వరం వచ్చిందిలే.

శ్రుతి హాసన్ ఇప్పుడు తన తాజా హింది చిత్రం ‘బెహేన్ హోగి తేరీ’ ప్రమోషన్ లో బిజీ గా ఉంది. ఈ సినిమాలో హీరోగా రాజకుమార్ రావు నటిస్తున్నాడు. అజయ్ పన్నాలాల్ డైరెక్ట్ చేస్తున్నారు. పక్క ఇంటి పిల్ల ఎదురింటి కుర్రోడు ప్రేమ కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోందిగా.. ఇక జూన్ 9న ఈ సినిమా భవిత్యం ఏంటో భయటపడనుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/