Begin typing your search above and press return to search.
శృతి మళ్ళీ బాక్ టు షేప్ నా??
By: Tupaki Desk | 13 May 2019 2:30 PM GMTస్టార్ కిడ్స్ చాలామందే ఉంటారు కానీ కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ రూటే సెపరేటు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరసగా అన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఐరన్ లెగ్ అనిపించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా 'గబ్బర్ సింగ్' ఒక్కసారిగా శృతిని లక్కీ హ్యాండ్ చేసేసింది. ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్స్ లో నటించింది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం మొదలు పెట్టి అందరినీ షాక్ కు గురి చేసింది. లండన్ కు మకాం మార్చి ఇంటర్నేషనల్ సింగర్ అవుతానంటూ సినిమాలకు దూరం అయింది.
అయితే లండన్ కలలు ఫలించకపోవడంతో మళ్ళీ ఇండియాకు వచ్చేసింది. ఈమధ్యే విజయ్ సేతుపతి సినిమా 'లాబం' లో హీరోయిన్ గా సైన్ చేసింది. ఏప్రిల్ లోనే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమా మాత్రమే కాకుండా రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కంటే ఫిట్నెస్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈమధ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలలో ఆవిషయం తెలుస్తోంది.
తాజాగా ఇన్స్టా ఖాతాలో ఒక సెల్ఫీ పోస్ట్ చేసి "నెవర్ సే నెవర్ #లండనింగ్" అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో స్పోర్ట్స్ వేర్ ధరించిన శృతి యమా ఫిట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటో చూస్తే శృతి మళ్ళీ బ్యాక్ టు షేప్ అనిపిస్తోంది కదా? ఈ ఫోటో కింద కామెంట్లలో కొందరు నెటిజనులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫోటో నెటిజనులకు నచ్చిందేమో కానీ 20 గంటల్లోపే 2 లక్షల లైకులు కొట్టారు.