Begin typing your search above and press return to search.
శృతి హాసన్.. 'బి ది బిట్చ్' అంటోంది
By: Tupaki Desk | 14 Oct 2016 4:19 AM GMTఓ మాట అనేయడం సింపులే.. కానీ పడే వాళ్లకే తెలుస్తోంది ఆ నొప్పేంటో. అయితే అంత బాధలోనూ వచ్చిన విమర్శలకి.. టార్గెట్ చేసిన వాళ్లకి సమాధానం చెప్పడంలోనే ఉంటుంది గొప్పతనమంతా. ఎగ్జట్ గా అదే చేసింది శృతిహాసన్. ఏ మాటకమాట చెప్పుకోవాలంటే అందంతో పాటు శృతికి డేర్ కూడా ఎక్కువే.
కథలు.. కవితలు రాయడం అలవాటున్న శృతి వరసబెట్టి బాధ పెట్టిన సంఘటలన్నింటిని పేపర్ మీద పెట్టేసింది. దాన్ని ''బి ది బిట్చ్'' అంటూ ఒక వీడియో రూపంలోకి తెచ్చింది.. ''నచ్చింది చేయడం.. నా బతుకు నేను బతకడమే మీకు బిట్చ్ లా కనిపిస్తే అలా పిలిపించుకోడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకు నచ్చింది నేను చేయడమే బిట్చ్. నచ్చిన బట్టలు వేసుకోవడం బిట్చ్. నా ప్రేమ. నా తప్పులు. నా జీవితం. నా ఇష్టం'' అంటూ ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇచ్చింది. డైలీ లైఫ్ లో లేడీస్ మీద వినిపించే కామెంట్స్ అన్నింటిని లిస్టౌట్ చేసి మరీ స్ట్రాంగ్ గా సమాధానం చెప్పింది. తన మీద రాయి వేస్తే దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు... కానీ అది తిరిగి వేసినవారికి తగలకుండా చూసుకోండంటూ ఘాటుగా ఇచ్చిన మేసెజ్ కి అందరూ ఫిదా అయ్యారు. సూటిగా సుత్తి లేకుండా ''బి ది బిట్చ్'' అనేసిందంతే.
ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కారణాలు కూడా చెప్పింది. ఓ సారి ముంబై సెంట్రల్ స్టేషన్లో శృతికి చేదు అనుభవం ఎదురైందట. పొరబాటున ఎదురుగా ఉన్న ఓ లేడీకి తగలడం.. సారీ చెప్పే లోపే ఆమె శృతిని బిచ్ అంటూ అనకూడని మాట అనేయడం జరిగిందట. ఆ పదానికి అర్థం తెలిసిన వాళ్లేవరూ అంత త్వరగా వాడరు. అలాంటిది ఓ మహిళ ఇంకో మహిళని అలా ఎలా తిడుతుందంటూ శృతి చాలా హర్ట్ అయిందట. అందుకే ఇలా రియాక్ట్ అయ్యిందట. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/