Begin typing your search above and press return to search.
శ్రుతి హాసన్.. అతడికి ప్రేమతో
By: Tupaki Desk | 18 Feb 2018 7:25 AM GMTఅధికారికంగా ప్రకటించకపోయినా శ్రుతి హాసన్ ప్రేమలో పడ్డ విషయం స్పష్టం. బ్రిటన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సల్ తో ఆమె కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ.. పెళ్లి.. గురించి ఖరారు చేయకపోయినా మైకేల్ తనకు చాలా స్పెషల్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది శ్రుతి. గత నెలలో శ్రుతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలో ఆమె వెంటే ఉన్నాడు మైకేల్. అంతకుముందు మైకేల్ ఇండియాకు వచ్చి శ్రుతితో కలిసి మీడియా కెమెరాలకు పలుమార్లు చిక్కాడు. ఒక కార్యక్రమంలో అతను తమిళ స్టయిల్లో పంచెకట్టులోనూ కనిపించడం.. పక్కన కమల్ కూడా హ్యాపీగా కనిపించడంతో శ్రుతి-మైకేల్ పెళ్లి ఇక లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమైంది.
తాజాగా మైకేల్ తనకు ఎంత స్పెషలో చాటి చెప్పేలా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది శ్రుతి. మైకేల్ పుట్టిన రోజు సందర్భంగా శ్రుతి పెట్టిన మెసేజ్ చూస్తే అతడిపై ఆమె ప్రేమ ఎంతటితో అర్థమవుతుంది. ‘‘మై బెస్ట్ ఫ్రెండ్.. పార్టనర్ ఇన్ క్రైమ్.. నాతో పాటు ప్రపంచాన్ని చుట్టొచ్చేందుకు ఇష్టపడే సహ ప్రయాణికుడు. ప్రతి విషయంలోనూ నాతో పాటు నవ్వుతుండే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే’’ అంటూ శ్రుతీహాసన్ ట్వీట్ చేసింది. ఈ సంతోష సమయంలో నీ చెంత లేనందుకు క్షమించమంటూ కోర్సల్ ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించింది. ఫన్నీయెస్ట్ మ్యాన్ ఐ నో.. హార్ట్ ఆఫ్ గోల్డ్.. బర్త్‌డే బాయ్.. సారీ ఐయామ్ నాట్ దేర్.. హ్యాపీ మి హ్యాపీ అస్.. అంటూ హ్యాష్ ట్యాగులు కూడా జోడించింది శ్రుతి. ఈ మెసేజ్ చూస్తే అర్థం కావట్లేదో శ్రుతి-మైకేల్ బంధం ఎలాంటిదో?