Begin typing your search above and press return to search.
విద్వేషపూరిత సంస్కృతి పెరిగిపోయిందంటోంది!
By: Tupaki Desk | 5 Nov 2022 1:30 PM GMTతెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది హీరోయిన్ శృతిహాసన్.మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టింది. అప్పటి నుంచి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ ఇతర హీరోయిన్ లని ఆశ్చర్యపరుస్తోంది. శృతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `సలార్`లో, సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవితో `వాల్తేరు వీరయ్య`, నందమూరి బాలకృష్ణతో `వీర సింహారెడ్డి` చిత్రాలలో నటిస్తోంది.
ఈ క్రేజీ సినిమాలతో పాటు హాలీవుడ్ లో `ది ఐ`మూవీలోనూ నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇదిలా వుంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విద్వేషపూరిత విష సంస్కృతిపై తాజాగా శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ సినిమాలు విడుదలవుతున్న ప్రతీసారి సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ వివాదం తలెత్తడం తెలిసిందే. ఈ విషయంపై శృతిహాసన్ తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
శృతీహాసన్ బాలీవుడ్ బాయ్ కాట్ వివాదంపై స్పందిస్తూ ..ఇది కేవలం సినిమాకు మాత్రమే కాదు. ఇలా ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడం లేదంది. ఇలా ఎందుకు జరుగోందో తనకు అర్థం కావడం లేదని చెబుతోంది. దీనికి చాలా కారణాలున్నాయని, మనమందరం దీనిపై ఒక్కసారి ఆలోచించుకోవాలి. సినిమాలని రద్దు చేయాలనే సంస్కృతి అనేది బెదిరింపు, దాడి చేయడం లాంటిది. ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే మనం చూస్తున్నాం.
కానీ ప్రస్తుతం సమాజంలో ఆన్ లైన్ సంస్కృతి విద్వేషం నింపేలా మారింది అని తెలిపింది. అంతే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వుంటుందో వివరించే ప్రయత్నం చేసింది. ఇక తనని `చుడైల్` (మంత్రగత్తె) అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది. కానీ దానిని అధిగమిస్తానని నాకు తెలుసు. నేను నా సొంత మార్గంలో ఆలోచిస్తాను` అని వెల్లడించింది శృతిహాసన్.
గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలపై బాయ్ కాట్ వివాదం అలుముకుంటున్న విషయం తెలిసిందే. దీని కావణంగా చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు తీవ్ర నష్టాలని ఎదుర్కొన్నాయి. ఇందులో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తో పాటు ఇంత వరకు విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాయ్ కాట్ వివాదం కారణంగా నష్టపోయిన విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.