Begin typing your search above and press return to search.
నాన్నను చూస్తుంటే నాకు రావాలనిపిస్తుంది
By: Tupaki Desk | 14 April 2019 5:44 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను నిలిపి కమల్ హాసన్ వారి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో పార్లమెంటుకు ఆయన పోటీ చేయలేదని తమిళ వర్గాల వారు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం సీట్లను దక్కించుకోవడం వల్ల పార్టీ బలోపేతం చేయవచ్చని కమల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకు మద్దతుగా ఆయన పెద్ద కూతురు శృతి హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తోంది. డైరెక్ట్ గా రంగంలోకి దిగకున్నా ఆమె సోషల్ మీడియా ద్వారా తండ్రి పార్టీకి ఓటు వేయమని కోరుతుంది.
తాజాగా ఒక సందర్బంలో శృతి హాసన్ స్పందిస్తూ... తన తండ్రి రాజకీయాల్లో వెళ్లి, ప్రజా సేవ కోసం పరితపించడం చూస్తుంటే నాకు కూడా రాజకీయాలపై ఆసక్తి కలిగి, రాజకీయాల్లో జాయిన్ అవ్వాలనే కోరిక కలుగుతుంది. రాజకీయాల్లోకి ఇప్పటికప్పుడు వచ్చే ఆలోచన అయితే లేదని చెప్పుకొచ్చింది. మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూ, చీకటి జీవితాల్లో చార్చ్ లైట్ తో వెలుగులోకి తీసుకు రావాలనుకుంటున్న మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థులను గెలిపించండి అంటూ శృతి హాసన్ కోరింది.
రాబోయే తరాలకు మంచి పరిపాలను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని, తప్పకుండా భవిష్యత్తులో మంచి జరుగుతుందనే అభిప్రాయం తనకు ఉందని, నాన్న అనుకున్నది సాధిస్తాడని, భవితరాలకు మంచి భవిష్యత్తును అందిస్తాడనే నమ్మకం తనకు ఉందని, ప్రతి ఒక్కరు కూడా టార్చ్ లైట్ కు ఓటు వేయాలని ఆమె కోరింది. కమల్ హాసన్ తమిళ నాట ఎన్ని పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాడా అని సౌత్ ఇండియాలోని ఆయన అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.