Begin typing your search above and press return to search.

ఫాలోయర్లు సూపరబ్బా.. కాని..

By:  Tupaki Desk   |   4 April 2018 9:48 AM GMT
ఫాలోయర్లు సూపరబ్బా.. కాని..
X
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తన సొంత టాలెంట్ తోనే పేరు తెచ్చుకుంది శ్రుతి హాసన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో ఈ భామ కెరీర్ యు టర్న్ తీసుకుంది. అప్పటివరకు ఫ్లాప్ ముద్రతో అష్టకష్టాలు పడ్డ శ్రుతి ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆఫర్లు వచ్చిపడ్డాయి. చివరగా మళ్లీ పవన్ పక్కన కాటమరాయుడు సినిమాతో ఆమె కెరీర్ పక్కన కామా మార్క్ పడింది.

ప్రస్తుతం శ్రుతి చేతిలో తెలుగు.. తమిళం సినిమాలేమీ లేవు. ఆమె డెయిరీ ఖాళీగానే ఉంది. కానీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సౌత్ లో ఇంకే హీరోయిన్ కీ లేదు. ఇది ట్విట్టర్ చెబుతున్న లెక్క. ట్విట్టర్ లో శ్రుతిని 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్న సమంతను 6.5 మిలియన్ల మంది.. రకుల్ ప్రీత్ సింగ్ 2.3 మిలియన్ల మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో చాలామందికి ఈ రేంజిలో ఫాలోయర్లు లేరు.

సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న శ్రుతికి ఆఫర్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం లండన్ కు చెందిన యాక్టర్ మైఖేల్ కార్సేల్ తో డేటింగ్ ఉందనే న్యూసే. వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ అండ్ బాలీవుడ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. దాంతో డైరెక్టర్లు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్డపడడం లేదు. తాజాగా జాన్ అబ్రహాం పక్కన ఓ సినిమా చేయడానికి మాత్రం శ్రుతి అంగీకరించేదనేది బాలీవుడ్ లో లేటెస్ట్ న్యూస్.