Begin typing your search above and press return to search.
వింత మాస్కుతో బంతాడుతున్న స్టార్ డాటర్
By: Tupaki Desk | 27 Oct 2020 6:15 AM GMTచక్కనమ్మ ఏం చేసినా సక్కంగానే ఉంటుంది. క్రేజీ హీరోయిన్ శ్రుతి హాసన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను పంచుకుంది. నిత్యం ఏదో ఒక విషయాన్ని .. పొటోని.. వీడియోని షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో వుంటున్న శృతిహాసన్ ఓ ఆసక్తికరమైన వీడియోని షేర్ చేసింది. ఎండింగ్ లో అదిరే ట్విస్ట్ కూడా ఇచ్చింది. రొటీనిటీ ఎంతమాత్రం నచ్చని శ్రుతి వెరైటీ మాస్క్ ధరించి కనిపించింది. అంతే కాకుండా `పరిశుభ్రపరచండి లేదా దూరంగా ఉండండి` అని దానికి క్యాప్షన్ ని ఇచ్చింది. తనదైన స్టైల్లో అభిమానుల్ని ఈ వీడియోతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం శృతిహాసన్ నటిస్తున్న `క్రాక్` విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్న ఈ భామకు టాలీవుడ్ పై చాలా హోప్స్ ఉన్నాయిట. మైఖేల్ కోర్సల్ తో డేటింగ్ కారణంగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన శృతిహాసన్ మళ్లీ వరుస చిత్రాల్లో నటిస్తూ యాక్టివ్ అయిపోయివాలన్నది ప్లాన్. రవితేజ హీరోగా గోపీచంద్ డైరెక్ట్ చేస్తున్న క్రాక్ ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.
ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చివరి షెడ్యూల్ పూర్తి చేస్తున్నారు. త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.ఈ క్రేజీ మూవీలో పందెంకోడి వరలక్షి శరత్ కుమార్ కరుకైన విలన్ గా కనిపించబోతోంది.