Begin typing your search above and press return to search.

తెలుగు సినిమాలను విమర్శించింది.. ఇప్పుడు మాట మార్చింది

By:  Tupaki Desk   |   6 Oct 2020 1:30 PM GMT
తెలుగు సినిమాలను విమర్శించింది.. ఇప్పుడు మాట మార్చింది
X
మల్టీ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కెరీర్‌ ఆరంభంలో వరుసగా ఫ్లాప్‌ లు పడ్డాయి. ఆ సమయంలో ఈమెకు తెలుగు మూవీ గబ్బర్‌ సింగ్‌ తో మొదటి సూపర్‌ హిట్‌ ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగు మరియు ఇతర భాషల్లో బిజీ అయ్యింది. రేసు గుర్రం సినిమాతో మరో కమర్షియల్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ లను శృతి దక్కించుకుంది. ఆ సినిమాలు రెండు కూడా ఆమె కెరీర్‌ ను ఎక్కడికో తీసుకు వెళ్లడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాలపై శృతి హాసన్‌ నోరు పారేసుకుని ఇప్పుడు అయ్యో నా ఉద్దేశ్యం అది కాదు అంటూ మీడియా కథనాలను తప్పుబడుతుంది అంటూ నెటిజన్స్‌ ఆమెపై ఫైర్‌ అవుతున్నారు.

అసలు విషయం ఏంటీ అంటే.. ఇటీవల శృతి హాసన్‌ ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను చాలా సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాను. కాని నాకు ఆ సమయంలో నాకు అంత గొప్ప ఫీలింగ్‌ ఏమీ కలుగలేదు. ఇకపై నేను మంచి ఛాయిస్‌ లను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాను. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఇకపై ప్రాజెక్ట్‌ లను ఎంపిక చేసుకోబోతున్నట్లుగా పేర్కొంది. అంటే ఇప్పటి వరకు ఆమె నటించిన సూపర్‌ హిట్‌ లు ఆమెకు అంత గొప్ప ఫీలింగ్‌ ఇవ్వలేదు అంటే గబ్బర్‌ సింగ్‌ మరియు రేసు గుర్రం సినిమాలను విమర్శించినట్లే అంటూ ఆమెపై నెట్టింట ట్రోల్స్‌ మొదలు అయ్యాయి.

సోషల్‌ మీడియాలో తన గురించి వస్తున్న ట్రోల్స్‌ పై శృతి హాసన్‌ స్పందించింది. తన గురించి వస్తున్న వార్తలను కొట్టి పారేసింది. అవి ఏమాత్రం సరైనవి కావని నాకు పవన్‌ కళ్యాణ్‌ గారితో నటించడం చాలా గొప్ప అచీవ్‌ మెంట్‌ రేసుగుర్రం మరియు గబ్బర్‌ సింగ్‌ సినిమాలు నా కెరీర్‌ లో కీలకమైన సినిమాలు వాటి గురించి నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడను. నేను పేర్లు చెప్పకుండానే మీరు ఎలా ఊహించుకుంటారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి శృతి హాసన్‌ అప్పుడు అలా అనేసి ఇప్పుడు మాట మార్చింది అంటూ కొందరు రివర్స్‌ కౌంటర్‌ వేస్తున్నారు.