Begin typing your search above and press return to search.

ఎన్ని ఫోటోషూట్లు చేసినా ఆఫ‌ర్లు నిల్!

By:  Tupaki Desk   |   1 March 2020 4:44 AM GMT
ఎన్ని ఫోటోషూట్లు చేసినా ఆఫ‌ర్లు నిల్!
X
ఎన్ని ఫోటోషూట్లు చేస్తే ఏం లాభం? ఆఫ‌ర్లేవీ? ఒక‌సారి అందివ‌చ్చిన స‌ద‌వ‌కాశాన్ని దుర్వినియోగం చేస్తే దాని ఫ‌లితం ఇలానే ఉంటుంది. ఎవ‌రికీ చిక్క‌ని అరుదైన‌ స్టార్ డ‌మ్ అందుకుని ఒకే ఒక్క త‌ప్పుడు నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా కిందికి ప‌డిపోవ‌డం స్వ‌యంకృత‌మే. కోరి తెచ్చుకున్న ముప్పు ఇది. అయితే దీనికి శ్రుతి ఏమైనా రిగ్రెట్ ఫీల‌వుతోందా? అంటే అబ్బే అలాంటిదేమీ లేద‌ని క్లారిటీ ఇచ్చేసింది.

మైఖేల్ కోర్స‌లేతో స‌హ‌జీవ‌నం.. వ్య‌క్తిగ‌త జీవితానికే ఆ మూడు నాలుగేళ్లు ప్రాధాన్య‌త‌నిచ్చింది. త‌న‌కు ఎంతో ఆస‌క్తి ఉన్న మ్యూజిక్ బ్యాండ్ పైనా దృష్టి సారించింది. దుర‌దృష్ట వ‌శాత్తూ అవి రెండూ ఫెయిల్. ఇక దాంతో ఆ ఎఫైర్లు రెండూ వ‌దిలేసి పాత దారిలోకే వ‌చ్చేసింది. నెమ్మ‌దిగా తిరిగి క‌థానాయిక‌గా త‌న స్టార్ డ‌మ్ ని వెన‌క్కి తెచ్చుకోవాల‌ని త‌ప‌న ప‌డుతోంది.

ఆ క్ర‌మంలోనే వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఇటీవ‌లే ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకున్న సంగ‌తిని బ‌హిరంగంగా అంగీక‌రించిన శ్రుతి.. అలా చేస్తే త‌ప్పేమీ లేద‌ని స‌మ‌ర్థించుకుంది. నా బాడీ నా ఇష్టం! అని క‌వ‌ర్ చేసేసింది. ఇక వ‌రుస ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాని శ్రుతి షేక్ చేస్తోంది. తాజా షూట్ లో శ్రుతి స‌వ‌రించిన ముక్కు ఏదో కొత్త‌గానే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్ చిత్రంలో న‌టించ‌నుంది. ఇక మరోవైపు క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ ఆర్జిస్తున్నా.. అది త‌న కెరీర్ కి క‌లిసొచ్చేదేమీ కాదు. ఇప్ప‌టికీ టాలీవుడ్ - బాలీవుడ్ నుంచి స‌రైన ఆఫ‌ర్లు లేవు. కోలీవుడ్ లోనూ అంతంత మాత్ర‌మే. మ‌రి ఈ డైల‌మా నుంచి ఎప్ప‌టికి బ‌య‌ట‌ప‌డుతుందో ఏమిటో!