Begin typing your search above and press return to search.

పవన్ మొదలెట్టినా శృతి జంపైంది!!

By:  Tupaki Desk   |   21 Sept 2016 11:00 PM IST
పవన్ మొదలెట్టినా శృతి జంపైంది!!
X
ఇప్పటికే ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా.. సికింద్రాబాద్ లో ''కాటమరాయుడు'' సినిమా షూటింగ్ మొదలయ్యిదంటూ స్టిల్స్ చాలానే వచ్చేశాయి. అయితే ఇవన్నీ చూస్తుంటే 24 నుండి పవన్ కళ్యాణ్‌ కూడా ఖచ్చితంగా రెగ్యులర్ షూటింగులో జాయిన్ అవుతాడని మనకు అర్దమవుతోంది. ఇదంతా సరే మరి సెక్సిణి శృతి హాసన్ ఎప్పుడు రంగంలోకి దిగుతోంది?

గత రాత్రి హైదరాబాదులో కైపెక్కించే అందాలతో మత్తెక్కించింది శృతి హాసన్. అమ్మడు ప్రేమమ్ సినిమా ఆడియో లాంచ్ లో భారీ సందడే చేసింది. అసలు స్లీవ్లెస్ టాపులో అమ్మడు అలా అలా అందాలను ఆరబోస్తుంటే.. చూపరులు తలలు తిప్పలేదనుకోండి. అయితే ఎలాగో హైదరాబాద్ వచ్చేసింది కాబట్టి.. మరి కాటమరాయుడు షూటింగులో పాల్గొంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కాని ఇప్పటికే చాలా రోజుల నుండి ఈ సినిమా మొదలవ్వడం కోసం ఎదురు చూసిన శృతి.. ఇప్పుడు లండన్ చెక్కేసింది.

ప్రేమమ్ ఆడియో లాంచ్ కంప్లీట్ అవ్వగానే స్ర్టయిట్ గా ఎయిర్ పోర్టుకు బయలుదేరిన శృతి హాసన్.. లండన్ ఫ్లయిట్ ఎక్కేసింది. అమ్మడు ఆ ఛారిత్రాత్మక కాస్మోపొలిటన్ నగరంలో ''సింగం 3'' సినిమా పాటల షూటింగులో సూర్యను రొమాన్స్ చేయనుందట. ఆ విధంగా జంపైన శృతి మరి కాటమరాయుడు షూటింగులో ఎప్పుడు జాయిన్ అవుతుందంటారు?