Begin typing your search above and press return to search.
ముగ్గురు క్రికెటర్లతో శృతి ఆట, పాట
By: Tupaki Desk | 22 April 2016 12:56 PM GMTచెన్నై సుందరి శృతి హాసన్ సౌత్ లోనే కాదు... నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించేసింది. గతేడాది విడుదలైన వెల్ కం బ్యాక్ - ప్రస్తుతం రాకీ హ్యాండ్సమ్ చిత్రాలు.. శృతి క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. దీంతో ఇప్పుడీ భామ నేషనల్ బ్రాండ్స్ కు.. బ్రాండ్ అంబాసిడర్ అయిపోతోంది. ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోతోంది. ఈ అవకాశాన్ని కంపెనీలు బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి.
ఇందులో భాగంగా పలువురు క్రికెటర్లతో కలిపి యాడ్స్ రూపొందిస్తున్నాయి కంపెనీలు. లాయిడ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. ఇప్పడు ముగ్గురు క్రికెటర్లతో కలిపి ఓ యాడ్ రూపొందించింది. రాయల్ ఛాలెంజర్స్ టీంకు అఫీషియల్ పార్ట్నర్ అయిన ఈ కంపెనీ.. ఆ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ - జట్టు సభ్యులైన షేన్ వాట్సన్ - క్రిస్ గేల్ లతో కలిపి ఓ యాడ్ రూపొందించింది. ఇలా ఇండియన్ - ఆస్ట్రేలియా - వెస్టిండీస్ క్రికెట్ స్టార్లతో కలిపి రూపొందించే యాడ్ కు మరింత కలర్ ను తెచ్చేందుకు శృతి హాసన్ ను తెచ్చుకుంది ఆ కంపెనీ.
అలా ఈ స్టార్ క్రికెటర్లతో కలిపి ఒకేసారి నటించే అవకాశం శృతి హాసన్ కు వచ్చింది. బెంగళూరులో ఇప్పటికే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ యాడ్ ప్రసారం కానుంది. ఈసారి ఐపీఎల్ ను మ్యాచ్ సమయంలోనే కాదు.. బ్రేక్ టైంలో కూడా కంపల్సరీగా చూడాలేమో కదా.