Begin typing your search above and press return to search.

బంగారు మాస్కుతో ఏమిటీ కుమ్ముడు అమ్మ‌డూ?

By:  Tupaki Desk   |   31 July 2020 6:50 AM GMT
బంగారు మాస్కుతో ఏమిటీ కుమ్ముడు అమ్మ‌డూ?
X
అందానికి అందం.. చ‌క్క‌ని అభిన‌యం.. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే త‌త్వం శ్రుతి హాస‌న్ కి ఆభ‌ర‌ణాలు. ప్ర‌యోగాల హీరో‌ క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టినా త‌న‌దైన ట్యాలెంట్ తో స‌త్తా చాటింది. స్టార్ హీరోయిన్ గా గాయ‌నిగా ఆల్ రౌండ‌ర్ ప్ర‌తిభ‌తో మెరిపించింది. వ్య‌క్తిగ‌త జీవితంలో కొంత స‌ర్ధుబాటు త‌ర్వాత శ్రుతి రెట్టించిన ఉత్సాహంతో కెరీర్ ని ప‌రుగులు పెట్టించే ఆలోచ‌న‌తో ఉంది.

ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న క్రాక్ చిత్రంలో న‌టిస్తోంది. అదంతా స‌రే కానీ.. శ్రుతి లేటెస్ట్ ఫోటోషూట్ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బ్లాక్ అండ్ గోల్డ్ లో శ్రుతి మెరుపులే మెరుపులు. ప్యూర్ బ్లాక్ టాప్ .. ఆపైన అంతా బంగారు గొలుసులు ఏమిటీ వింత‌? పైగా ఆ ముక్కుకు బంగారంతో త‌యారు చేసిన డిజైన‌ర్ మాస్క్ ని ధ‌రించింది. నుదిటిన పాపిడి బొట్టు మొద‌లు ముక్కు నోటిని క‌వ‌ర్ చేస్తూ మాస్క్.. దానికి కాంబినేష‌న్ గా ఒంటిపై వేలాడుతున్న చైన్ లు .. అబ్బో ఈ గెట‌ప్పే అదుర్స్.. శ్రుతి గోల్డ్ మాస్క్ ముఖ‌చిత్రంతో ప్ర‌ఖ్యాత ఫిలింఫేర్ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూ వేడెక్కించేస్తోంది.

ఈ అవ‌తారం చూడ‌గానే అభిమానులు .. 300 మూవీ స్ఫూర్తితో జ‌క్సిస్ రాణిలా మారిందా? శ్రుతి ఏమిటీ గెట‌ప్? అంటూ డౌట్స్ వ్య‌క్తం చేశారు. ఏదేమైనా ఈ ప్ర‌య‌త్నం కొత్త‌గా ఉంది. అందుకే వైర‌ల్ గా మారుతోంది. లైఫ్ ఈజ్ ఏ మాస్క్ రేడ్ అన్నది అందుకేగా.

క‌రోనా మ‌హ‌మ్మారీ ఉధృత‌మ‌వుతున్న వేళ మాస్క్ ల‌కు విప‌రీత‌మైన‌ డిమాండ్ పెరిగింది. దీంతో ర‌క‌ర‌కాల డిజైన్ల‌లో మాస్కులు అందుబాటులోకి వ‌చ్చాయి. చ‌మురు వ‌దిలించుకునేవాళ్ల‌కు వ‌దిలించుకున్నంతా .. మాస్కుల కోస‌మే బోలెడంత ఖర్చు చేస్తున్నారు. ప‌లువురు డిజైన‌ర్ స్పెష‌లిస్టులు వజ్రాలతో నిండిన బంగారు మాస్కుల్ని త‌యారు చేస్తున్నారు. ఇవ‌న్నీ ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ డిబేట్ గా మారుతున్నాయి.