Begin typing your search above and press return to search.

శృతి మొదటి అనుభవానికి పదహారేళ్లు

By:  Tupaki Desk   |   18 Feb 2016 10:30 PM GMT
శృతి మొదటి అనుభవానికి పదహారేళ్లు
X
శృతి హాసన్ ఇప్పుడు కమల్ హాసన్ కూతురు అనే ఇమేజ్ నుంచి బయటకు వచ్చి.. సొంతగానే క్రేజ్ సంపాదించుకుంది. తండ్రి పేరు చెప్పకుండానే.. శృతి అనగానే ఆమె గురించి తెలిసేటంతగా గుర్తింపు పొందింది. ఇప్పటికి ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి సరిగ్గా పదహారేళ్లయింది. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది శృతి.

2000 ఫిబ్రవరి 18న విడుదలైన హేరామ్.. శృతి హాసన్ బాలనటిగా కనిపించిన మొదటి సినిమా. గాంధీజీని మర్డర్ చేయడం అనే కాన్సెప్ట్ పై తెరకెక్కిన ఈ మూవీలో.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురుగా ఒక పాత్రను పోషించింది శృతి. హిందీ - తమిళ్ రూపొంది తెలుగులో కూడా డబ్ అయిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది కమల్ హాసనే కావడం విశేషం. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న శృతి 2009లో లక్ సినిమాతో హిందీలోను, అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగులోనూ అరంగేట్రం చేసింది.

'16 ఏళ్లు. వావ్..' అంటూ మై ఫస్ట్ ప్రాపర్ మూవీ ఎక్స్ పీరియన్స్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేసింది శృతి హాసన్. ఇలా ఫస్ట్ ప్రాపర్ మూవీ అనడంలో అసలు ఉద్దేశ్యం ఏంటంటే.. ఊహ తెలిశాక చేసిన సినిమా అని. అంతకు ముందే కనీసం సరిగా మాట్లాడలేని ఏజ్ లోనే కమల్ మూవీ క్షత్రియపుత్రుడులో చిన్నారి పాపగా కనిపించింది శృతి హాసన్.