Begin typing your search above and press return to search.

శ్రుతి దెబ్బ‌కు ముంబై గ‌గ్గోలు

By:  Tupaki Desk   |   25 Aug 2018 5:38 PM GMT
శ్రుతి దెబ్బ‌కు ముంబై గ‌గ్గోలు
X
గ‌త కొంత‌కాలంగా శ్రుతిహాస‌న్ ఏం చేస్తోందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. చెన్న‌య్ టు ముంబై షికార్లు చేస్తూనే, విదేశాల‌కు వెళ్లి బోయ్‌ ఫ్రెండ్‌ తో సైలెంటుగా షికార్లు చేస్తోంద‌న్న పుకార్లు ఉన్నాయి. డాడ్ క‌మ‌ల్‌ హాస‌న్‌ - మామ్ సారిక‌ల‌కు అధికారికంగా త‌న రిలేష‌న్‌ షిప్ గురించి రివీల్ చేసిన శ్రుతి.. మేఖేల్ కోర్స‌లేని పెళ్లాడేందుకు రెడీ అవుతోంద‌న్న ప్ర‌చారం ఉంది. మైఖేల్‌ తో శ్రుతి రిలేష‌న్ షిప్‌ ని త‌ల్లిదండ్రులు అంగీక‌రించారు కాబ‌ట్టి అభిమానుల నుంచి అందుకు ఎలాంటి అభ్యంత‌రం లేదు.

ఇదివ‌ర‌కూ ప‌లుమార్లు హ‌బ్బీతో క‌లిసి ముంబై రెస్టారెంట్ల‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. లేట్‌ నైట్ డిన్న‌ర్లు - షికార్లు చేస్తూ.. అటుపై ముంబైలోని త‌న ఫ్లాట్‌ కి జంట‌గా చేరుకోవ‌డం.. వాచ్‌ మ్యాన్ టు పేప‌ర్‌ బోయ్‌.. చూసిన‌వాళ్ల నుంచి క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చింది. త‌న‌ని దుండ‌గుడు ఏ అపార్ట్‌ మెంట్ ప‌రిస‌రాల్లో అట‌కాయించాడో అదే ప‌రిస‌రాల్లో ఇప్పుడు శ్రుతి జంట‌గా షికార్లు చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

అదంతా అటుంచితే.. తాజాగా ముంబై లాక్మే ఫ్యాష‌న్ వీక్‌ లో శ్రుతి ర్యాంప్‌ పై త‌ళుకుళీన‌డం హాట్ టాపిక్‌ గా మారింది. ఓవైపు మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్న శ్రుతిహాస‌న్.. ఇలా ర్యాంప్ వాక్ కోసం బోలెడంత స‌మ‌యం కేటాయించింది. దిశాప‌టానీ - జాన్వీ క‌పూర్ లాంటి భామ‌లు వ‌య్యారాలు వ‌డ్డ‌న‌లు చేసిన చోట శ్రుతి ఇచ్చిన ఎంట్రీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌ గా మారింది. త‌న‌కు మాత్ర‌మే సూట‌వుతుందా? అనిపించే గోరింటాకు రంగు డ్రెస్‌లో మైమ‌రిపించింది. శ్రుతి దెబ్బ‌కు ముంబై గ‌గ్గోలు పెట్టిందంటే న‌మ్మండి!