Begin typing your search above and press return to search.

ల‌క్కంటే శృతిహాస‌న్ దే.. హ్యాట్రిక్ లాంఛ‌న‌మేనా?

By:  Tupaki Desk   |   17 Jan 2023 9:32 AM GMT
ల‌క్కంటే శృతిహాస‌న్ దే.. హ్యాట్రిక్ లాంఛ‌న‌మేనా?
X
ఇండ‌స్ట్రీలో ఎవ‌రి ల‌క్కు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు.. ఎవ‌రూ ఊహించ‌లేరు కూడా. రాత్రికి రాత్రే డిజాస్ట‌ర్‌ల‌ని ద‌క్కించుకున్న వారు వున్నారు.. అదే స్థాయిలో స్టార్స్ గా వెలిగిపోయిన వారూ వున్నారు. డిజాస్ట‌ర్లు ద‌క్కించుకున్న వాళ్లు స‌డ‌న్ గా బ్లాక్ బస్ట‌ర్ ల బాట ప‌ట్టిన వాళ్లు వున్నారు. క్రేజీ హీరోయిన్ శృతిహాస‌న్ కూడా ఇంతే గ‌తంలో ఫ్లాపుల్ని ఎదుర్కొన్న శృతిహాస‌న్ 2017 త‌రువాత సినిమాల‌కు బిగ్ బ్రేక్ ఇచ్చేసింది.

మూడేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ మ్యూజిక్ వీడియోల‌తో కాల‌క్షేపం చేసింది. ఆ త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో శృతిహాస‌న్ రీఎంట్రీ ఇచ్చిన మూవీ 'క్రాక్'. మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో శృతికి గుడ్ కంబ్యాక్ మూవీ అయింది. అక్క‌డి నుంచి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తున్న శృతిహాస‌న్ అదే స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని ద‌క్కించుకుంటోంది.

రీసెంట్ గా అగ్ర క‌థానాయ‌కులు మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీర‌య్య‌', నంద‌మూరి బాల‌కృష్ణ‌తో 'వీర సింహారెడ్డి' వంటి సినిమాల‌లో న‌టించింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బ‌రిలో నిలవ‌డం.. ఊహించిన స్థాయికి మించి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సూప‌ర్ హిట్ అనిపించుకోవ‌డంతో కెరీర్ లో ఏ హీరోయిన్ కు ద‌క్క‌ని అరుదైన స‌క్సెస్ లు ఒకేసారి ద‌క్కించుకున్న హీరోయిన్ గా శృతిహాస‌న్ రికార్డుని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా కెరీర్ లోనే హ‌య్యెస్ట్ గ్రాస్ ని ద‌క్కించుకున్న 'వాల్తేరు వీర‌య్య‌', వీర సింహారెడ్డి' వంటి సినిమాల్లో న‌టించిన హీరోయిన్ గానూ క్రెడిట్ ని ద‌క్కించుకుంది. సెకండ్ ఇన్సింగ్స్ ని 'క్రాక్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో మొద‌లు పెట్టిన శృతిహాస‌న్ ఇప్ప‌టికీ అదే ఫామ్ ని కొన‌సాగిస్తూ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్ర‌స్తుతం శృతిహాస‌న్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ 'స‌లార్‌'లో న‌టిస్తోంది.

చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్ర‌క‌టించిన చిత్ర బృందం ఆ రోజున ప‌క్కాగా రిలీజ్ చేయాల‌ని షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని శ‌ర‌వేగంగా జ‌రుపుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీతో శృతిహాస‌న్ హ్యాట్రిక్ హిట్ ని సొంతం చేసుకోవ‌డం లాంఛ‌న‌మే అని, ల‌క్కంటే శృతిహాస‌న్ దే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.