Begin typing your search above and press return to search.
చైతూకి శ్రుతి ఓకే.. పేరూ ఓకే!
By: Tupaki Desk | 25 Sep 2015 3:28 PM GMTనాగచైతన్య ప్రేమమ్ సినిమా ని ఏ క్షణాన చూశాడో తెలియదు కానీ... వెంటనే రీమేక్ చేసేయాలని డిసైడ్ అయిపోయాడు. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తన కోసమే తయారు చేసిన కథని కూడా పక్కనపెట్టించేసి, ఆయన దర్శకత్వంలోనే `ప్రేమమ్` రీమేక్ కి రంగం సిద్ధం చేసేశాడు. సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రేపోమాపో కొబ్బరికాయ కొట్టేలా ఉన్నారు. సినిమాకి `మజ్ను` అనే పేరును ఖరారు చేయబోతున్నారని ప్రచారం సాగింది. ఆ పేరునే ఖరారు చేశారని తాజా సమాచారం.
అలాగే ప్రధాన కథానాయికగా శ్రుతిహాసన్ అనుకొన్నారు. ఆమె కూడా ఓకే చెప్పేసిందట. `ప్రేమమ్` రీమేక్ లో నటించాలన్న ఆఫర్ తో నిర్మాతలు శ్రుతి దగ్గరికి వెళ్లగానే ఎగిరి గంతేసిందట. ఆ సినిమా అంటే శ్రుతికి చాలా ఇష్టమట. ఏ భాషలో రీమేక్ అయినా, ఎక్కడ్నుంచి ఆఫర్ వచ్చినా అందులో నటించాల్సిందే అనుకొందట. గమ్మత్తుగా ఆమె దగ్గరికి తెలుగు సినిమా ఆఫర్ వెళ్లేసరికి ఆనందంగా ఒప్పుకొందట. నేను ఎదురు చూస్తున్న సినిమా నా దగ్గరికి వచ్చేసిందని ఆమె పట్టరాని సంతోషంతో సంతకం చేసిందట. సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు ఉంటారు. మరో ఇద్దరిని ఎంపిక చేసే పనిలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది. రేపోమాపో ఆ హీరోయిన్ లు ఖరారవ్వగానే సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తారు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం.
అప్పట్లో నాగార్జున కథానాయకుడిగా మజ్ను అనే సినిమా వచ్చింది. అది ట్రాజెడీ కథతో తెరకెక్కిన సినిమా. కానీ తనయుడు చేయనున్న మజ్ను మాత్రం పక్కా వినోదంతో తెరకెక్కబోతోంది. ఒకబ్బాయి ముగ్గురమ్మాయిల్ని ప్రేమించే కథన్నమాట ఇది. ఒకమ్మాయి కోసం అప్పటి మజ్ను తపనపడితే, నేటి మజ్ను మాత్రం ముగ్గురమ్మాయిలతో ప్రేమాయణం సాగిస్తాడన్నమాట. అన్నట్టు ఈ సినిమాలో నటించాలని చాలామంది టాలీవుడ్ కథానాయకులు ప్రయత్నించారు. కానీ నాగచైతన్య మాత్రం తెలివిగా కర్చీఫ్ వేసేశాడు. `ప్రేమమ్` సినిమా గురించి తెలిసినవాళ్లంతా నాగచైతన్యకి హిట్టు నూటికి నూరుపాళ్లు ఖాయం అంటున్నారు. అదే నిజమైతే లక్కీ ఛాన్స్ కొట్టినట్టే!