Begin typing your search above and press return to search.
సరదాగా చాట్ చేద్దామంటే.. మూడ్ ఖరాబు చేసిన నెటిజన్
By: Tupaki Desk | 1 Jan 2022 5:33 AM GMTజీవితంలో ఎత్తుపల్లాలు అందరికి సహజమే. కానీ.. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ పెట్టేసుకొని పుట్టటమే కాదు.. సెలబ్రిటీ హోదాలో లైఫ్ ను చూసిన వారికి ఎదురుదెబ్బలు తగిలితే.. వాటి నుంచి కోలుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. శ్రుతిహాసన్ అలాంటి అమ్మాయి కాదు. ఓపెన్ గా ఉండటం.. దాచి పెట్టుకోవటం లాంటివి పెద్దగా తెలీదన్నట్లుగా ఉండే ఆమె.. అటు కెరీర్ లోనే కాదు.. లైఫ్ లోనూ చాలానే ఎదురుదెబ్బలు తిన్నారు. అయినప్పటికి ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ.. ముందుకు వెళుతున్న ఆమె జర్నీ.. మిగిలిన వారికి కాస్తంత భిన్నంగా ఉంటాయని చెప్పాలి.
వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమైన శ్రుతిహాసన్.. ఈ మధ్యనే తెర మీదకు రావటం తెలిసిందే. అనూహ్యంగా ఆమె కంబ్యాక్ మూవీలైన క్రాక్.. వకీల్ సాబ్ రెండు సూపర్ హిట్ కావటం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్యతో జత కడుతున్న శుత్రి.. తాజాగా ఆన్ లైన్ లో సరదా చాట్ కోసం వచ్చారు. కొత్త సంవత్సరానికి కాస్త ముందుగా నెటిజన్లతో ఆమె మాట్లాడే సందర్భంలో.. ఒక నెటిజన్ అవసరానికి మించిన చొరవతో.. వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించాడు. శ్రుతి.. ఇప్పటివరకూ మీ జీవితంలో ఎన్ని బ్రేకప్ లు ఉన్నాయి? అని ప్రశ్నించాడు.
దీంతో స్పందించిన శ్రుతి.. మీకెంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అని ప్రశ్నించింది. నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు? నువ్వు అడిగే ప్రశ్నల్ని చూస్తే.. నీకు ప్రియురాలు ఎవరూ ఉండకపోవచ్చన్నది తన అభిప్రాయంగా పేర్కొంది. సరదాగా చాట్ చేద్దామని భావించిన శ్రుతికి అనుకోని రీతిలో ఎదురైన ఈ ప్రశ్న.. ఆమెను బాగానే డిస్ట్రబ్ చేసిందని చెప్పక తప్పదు.